ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

ఎర్రజెండా పార్టీలకు హ్యాండ్ ఇవ్వడం వ్యూహాత్మక మా.!కెసిఆర్ వ్యూహాన్ని కాంగ్రెస్ అనుకూలంగా మలుచుకుంటుందా..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..

Written by Mohiddin Shaik

వామపక్షాలతో పొత్తు విషయం తేల్చకుండా ఇప్పటివరకు సాగదీసి పొత్తు లేదని చెప్పకనే చెప్పిన కేసీఆర్ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల ఓట్లను ఒక వజ్రాయుధంలా ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆ వామపక్షాలకు హ్యాండ్ ఇవ్వడం వ్యూహాత్మకమైనని కొందరు పరిశీలకులు పేర్కొంటున్నారు. వామపక్షాలకు తమతో చెలిమి ఉంటుందనే సంకేతాలు ఇస్తూ ఆపి చివరకు పొత్తు లేదని సంకేతాలిస్తే ఇక ఆ పార్టీలు సొంతంగా ఎన్నికలకు వెళతాయని కెసిఆర్ అంచనా వేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కలిసి వారికి బలమున్నచోట పోటీ చేయాలనే నిర్ణయం గతంలోనే జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఆ పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా స్వయంగా పోటీలో ఉండాలని కెసిఆర్ కోరుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీలు వేరుగా పోటీకి దిగితే అనేక స్థానాల్లో ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బిజెపితో పాటుగా కమ్యూనిస్టు అభ్యర్థి కూడా రంగంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మూడు రకాలుగా చీలిపోతే టిఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో సునాయాసంగా గెలవగలుగుతారని గులాబీ బాస్ వ్యూహరచన చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే కమ్యూనిస్టులను మునుగోడు గండం గట్టెక్కే వరకు వాడుకొని గులాబీ బాస్ వ్యూహాత్మకంగానే వదిలేశారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

….. మునుగోడు ఉపఎన్నిక గెలుపు బిజెపి దూకుడు కి కళ్లెం వేసింది…

మునుగోడు ఉప ఎన్నికకు ముందు రాష్ట్రంలో బిజెపి నేతల దూకుడు చూస్తే బిజెపి ఈసారి అధికారంలోకి వస్తుందేమో అనే భావన అనేకమందికి కలిగింది. కెసిఆర్ సైతం మునిగేడు ఉప ఎన్నిక అంటే అది ఒక నియోజకవర్గం భవిష్యత్తు కాదు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అని ప్రకటించారు అక్కడ బిజెపి గెలిస్తే రాష్ట్రం ఆగమైపోతది అని కూడా ప్రకటించారు.. ఆయన మాటలకు తగ్గట్టే బిజెపి నేతలు కూడా ఒక్క మునుగోడులో గెలిపించండి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది అందులో అనేకమంది మాతో టచ్ లో ఉన్నారు అంటూ ప్రకటనలు చేశారు. జాతీయ నాయకుల సైతం ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండేలు వస్తారు బి ఆర్ ఎస్ లో కట్టప్పలు ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అవన్నీ విన్న కేసీఆర్ కమ్యూనిస్టుల కలయిక లేకపోతే బిజెపి మునుగోడులో గెలుస్తుంది అని భావించారు. అందుకే వామపక్ష పార్టీ , ఆహ్వానించి వారి మద్దతు కోరుకున్నారు వామపక్షాలు మద్దతు ఇచ్చాయి మునుగోడులో బిజెపి ఓడిపోయింది. టిఆర్ఎస్ గెలుపుకి కారకులు కమ్యూనిస్టులేనని ఆ విజయం కమ్యూనిస్టుల వల్లే సాధ్యపడిందని ముఖ్యమంత్రి గొప్పగా ప్రకటించారు. ఈ చెలిమి ఇలాగే కొనసాగుతుందని కూడా ప్రకటించారు. చివరకు ఇప్పుడు ఎన్నికల ముందు వామపక్షాలు అడిగిన కనీస సీట్లు కూడా ఇవ్వకుండా వదిలేశారు. ఈ చర్య వల్ల వామపక్ష పార్టీలు డైలమాలో పడిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే అవాక్కయినట్లయితే పొత్తు ఉండదని తెలిస్తే తమకు బలమున్న స్థానాల్లో ఇప్పటి కే ఆయా పార్టీలో ఉమ్మడి అభ్యర్థులను డిక్లేర్ చేసి ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టి ఉండేవారు. కానీ కెసిఆర్ ధోరణి ఆయా పార్టీలకు ఆ అవకాశం కూడా లేకుండా చేసిందని కొందరు అంటున్నారు. కెసిఆర్ తనకు మిత్రపక్షులుగా ఉన్న కమ్యూనిస్టులను కూడా తమ పార్టీ గెలుపు కోసం ఎత్తుగడవేసి అవి వేరుగా పోటీ చేసే విధంగా పరిస్థితులు కల్పించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అధికంగా చీల్చడమే లక్ష్యంగా వాము పక్షాలను కేసీఆర్ వదిలేశారని చర్చ జరుగుతుంది.

…. కెసిఆర్ వ్యూహాన్ని కాంగ్రెస్ ప్రతి వ్యూహంగా మలుచుకుంటుందా…

వ్యూహాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్ద ఎత్తున చీలిపోవాలని వ్యూహంతో కేసీఆర్ వామపక్షాలను పొత్తు నుంచి వదిలివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. వామపక్ష పార్టీలకు రాష్ట్రంలో ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ తో సహా పలు జిల్లాల్లో సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు పార్టీలకు కలిపి ఐదు నుంచి 30 వేల ఓట్ల వరకు ఉన్నాయి. రెండు పార్టీలకు కలిపి కాంగ్రెస్ కొన్ని స్థానాలు ఆయా పార్టీలకు కేటాయిస్తే దాదాపు 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపును ప్రభావితం చేసే ఓటు బ్యాంకు కమ్యూనిస్టు పార్టీలకు ఉందని కొందరు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వామపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించి ఆ పార్టీలకు స్నేహ హస్తం అందించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ ప్రతి వ్యూహం అమలు చేయడం ఖాయమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే కాంగ్రెస్కు అనేక స్థానాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయని కూడా కొందరు పేర్కొంటున్నారు. లేదా కాంగ్రెస్ ఈ తరుణంలో వామపక్షాలను వేరుగా పోటీ చేసుకునే విధంగా అవకాశం ఇస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయి బిఆర్ఎస్ అధినేత ఊహించినట్లుగా అన్హియస్థాయిలో బి ఆర్ ఎస్ రాష్ట్రంలో తిరిగి ఘన విజయం సాధిస్తుందని అభిప్రాయాలు కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో టిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేసిన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోతాయని కొందరు అంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment