అత్యంత ఉత్కంఠ మధ్య రాష్ట్రంలోని 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపు ఎందుకు ఆర్టీసీని విలీనం చేసే , బిల్లును ఆమోదింప చేసి, వరద ముంపు నుండి మున్నేటి పరివాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా మేలు జరిగేందుకు ఆర్సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఇటు ఆర్టీసీ కార్మికులు అటు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఎదురేగి ఘన స్వాగతం పలికారు. తమ జీవితాలలో వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి అజయ్ కుమార్ కు జేజేలు పలుకుతూ ఆయనకు గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. సోమవారం ఖమ్మం నగరం ఈ సందర్భంగా గులాబీ మాయం అయింది. బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో నగరంలోని దాదాపు అన్ని డివిజన్ ల నుంచి కార్పొరేటర్లు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఎదురేగి ఘన స్వాగతం పలికారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఒక పెద్ద విజయోత్సవ ర్యాలీల పెద్ద ఎత్తున సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గవర్నర్ ఎన్ని రకాలుగా చిక్కులు పెట్టినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతో ఆర్టీసీ కార్మికుల బతుకులు వెలుగు నింపాలని ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదింప చేశారని పేర్కొన్నారు. తాను ఆర్టీసీ మంత్రిగా ఉన్న సమయంలో ఈ చారిత్రక బిల్లు ఆమోదం పొందటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా 43 వేల ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉన్నాయని నా హయాంలో ఈ పని పూర్తి అయినందుకు నా జన్మ ధన్యం అయిందని నేను కూడా రుణపడి ఉన్నానని అజయ్ కుమార్ అన్నారు. అదేవిధంగా ఎప్పుడు మున్నేటికీ వరదలు వచ్చినా ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికి పోయే పరిస్థితి ఉందని అలాంటి పరిస్థితి నుంచి వారిని శాశ్వతంగా కాపాడేందుకు ఆర్సీసీ వాళ్లు నిర్మాణానికి ప్రజల పక్షాన తాను అడగగానే ముఖ్యమంత్రి మంజూరు చేసి నిధులు కూడా కేటాయించారని వేలాదిమంది ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు

….. మాది సంక్షేమ ప్రభుత్వం…
అభివృద్ది, సంక్షేమంలో తమ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదని, కేవలం ప్రజల సంక్షేమం మాత్రమే ఆశిస్తున్నదని అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా అన్ని విధాలుగా అండగా నిలబడి కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు . మరిన్ని నూతన సంక్షేమ పథకాలతో ప్రజలను అన్ని విధాలుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అజయ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారికి శాశ్వతంగా ఉద్యోగ భద్రత కల్పించడం ఒక చారిత్రక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు వెనుకబడిన తరగతుల వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అడుగడుగునా ఏ ఎన్నికలు వచ్చినా ఖమ్మం జిల్లా ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా కేసిఆర్ కు అండగా నిలబడుతున్నారని ఇదే సహకారాన్ని వచ్చే ఎన్నికల్లోనూ అందించి మూడవసారి అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మెడలో క్రేన్ ద్వారా భారీ గజమాలను వేసి ఆర్టీసీ కార్మికులు ప్రజలు తమ కృతజ్ఞత ను సంతోషాన్ని తెలియజేశారు.

