దాదాపు 67 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్. ఎందరో మేధావులకు విద్య నేర్పిన విద్య ఉన్నత విద్యా కేంద్రం. 1956లో ఈ కళాశాల స్థాపించారు .ఈ కళాశాలకు తాజాగా జాతీయస్థాయి ఏ. ప్లస్ .ప్లస్ . కేటగిరి స్థాయి న్యాక్ . గుర్తింపు లభించింది.
జాతీయస్థాయిలో ఇంత గొప్ప గౌరవం లభించడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఎంతో ఉందని, ఈ కళాశాల ప్రిన్సిపాల్ , సిబ్బంది పేర్కొన్నారు. ఈ గుర్తింపు ఐదేళ్లపాటు కొనసాగుతుంది. ఈ కళాశాలను 1956లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం పాటుపడిన వారిలో ముఖ్యులు శ్రీరామ భక్త గంట్యాల నారాయణరావు. ఈ కళాశాలను ఆయన స్థాపించారు. ఈ కళాశాల కోసం 72 ఎకరాల సువిశాలమైన స్థలాన్ని కేటాయించి , అవసరమైన భవన నిర్మాణాలు కూడా చేయించారు. వృక్ష శాస్త్ర విద్యార్థుల పరిశోధనల కోసం ఏడు ఎకరాలలో బొటానికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో చదివిన వందలాదిమంది విద్యార్థులు విదేశాలలో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు. అనేకమంది సైంటిస్టులుగా, ట్రాక్టర్లుగా , ఇంజనీర్లుగా , గొప్ప రాజకీయ నాయకులుగా, ఎదిగారు. ఈ కళాశాలకు దాదాపు 20 ఏళ్ల క్రితమే న్యాక్ గుర్తింపు వచ్చింది . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద 20 ఏళ్ల క్రితమే 12 బంగారు పథకాలను ఈ కళాశాల సొంతం చేసుకుంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో సెంట్రల్ యూనివర్సిటీకి అర్హత సాధించి వెళ్లేవారు. ఈ కళాశాల అభివృద్ధి చెందడం ద్వారా ఈ ప్రాంతంలో భావి తరాలు ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి బాగా ఉపయోగపడాలని ఈ విద్యాసంస్థను స్థాపించిన గంట్యాల రామారావు కన్న కలలు నెరవేరుతున్నాయి. ఇక్కడ అధ్యాపక బృందం పీహెచ్డీలు చేసినవారే అధిక సంఖ్యలో ఉంటారు. ఉన్నత ప్రమాణాలకు ఈ కళాశాల పెట్టింది పేరు. తాజాగా వచ్చిన జాతీయ స్థాయి అత్యున్నత గౌరవం ఖమ్మం జిల్లా పేరును జాతీయస్థాయిలో ఈ కళాశాల ద్వారా ఇనుముడింపజేస్తుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అజయ్ కుమార్ కృషిని, సహకారాన్ని కూడా అభినందిస్తున్నారు.
