ముగింపు సందర్భంగా రాహుల్ చేత ఘన సన్మానం
అదిలాబాద్ జిల్లా నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను తలపించింది.. అదే పంచ కట్టుతో, తలపాగాతో జనంలో మమేకమవుతూ , వారి బాధలు వింటూ , కాంగ్రెస్ విజయాలు , ఆశయాలు ప్రజలకు వివరిస్తూ, ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే అన్నట్లు సాగింది… , పాదయాత్ర సాగుతున్న మార్గంలో ఆ నాడు రాజశేఖరరెడ్డి వెంట జనం ఏ విధంగా పరుగులు తీశారు , బట్టి వెంట కూడా అదే విధంగా పరుగులు తీస్తూ కాబోయే ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ నినాదాలు ఇవ్వడం విశే విశేషం….ప్రస్తుత ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా వింటూ, ఆయన ఎంతో ఓపికగా 1360 కిలోమీటర్లు , 17 జిల్లాలు 36 నియోజకవర్గాలు కాలినడకన తిరిగారు. కాంగ్రెస్ శ్రేణుల్లో బట్టి విక్రమార్క పాదయాత్ర కొత్త ఉత్తేజాన్ని నింపింది. ..ఉన్నత విద్యావంతుడు, రాజకీయ పండితులకు సైతం అందని వ్యూహాలు, ఎత్తులతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు బట్టి విక్రమార్క, ఈ పాదయాత్రతో ఆ పార్టీలోని అగ్ర నేతల్లో ఒకటిగా చేరిపోయారు. ..
ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు సైతం ఆయన దరిచేరే అవకాశం కూడా లేనంత స్థాయికి పీపుల్స్ పాదయాత్ర విక్రమార్కను తీసుకెళ్లిందని కొందరు విశ్లేషిస్తున్నారు. …గ్రామ గ్రామాన తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ, కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ , ఆయన పాదయాత్ర సాగింది. భారత ప్రజల ను అందరినీ ఏకం చేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేసిన భారత్ జూడో యాత్ర స్ఫూర్తితో భట్టి చేపట్టిన పాదయాత్ర, ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని చెప్పవచ్చు.
…… చరిత్ర సృష్టించనున్న ముగింపు సభ. ..
బట్టి చేపట్టిన పాదయాత్ర చరిత్రలో మిగిలిపోయేదే కాక పాదయాత్ర ముగింపు సభ కూడా తన రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ సభకు ప్రత్యేకత ఏమంటే ఇదే సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాబలం కలిగిన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేలాదిగా తన అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ చేతులు మీదుగా అభినందన ఘన సన్మానం అందుకుంటున్న భట్టి విక్రమార్క ఆ సభకు హాజరయ్యే లక్షలాది మంది పార్టీ శ్రేణుల అభినందనలు కూడా అందుకోనున్నారు. అదే సందర్భంలో లక్షలాదిమంది హర్షద్వానాల మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా రాహుల్ గాంధీ చేత మెడలో వేయించుకోనున్నారు. బట్టి పాదయాత్ర ముగింపు సభ ఖమ్మం వేదికగా తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని ,
అది కూడా రాహుల్ గాంధీ ద్వారా జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగానే గాక జాతీయస్థాయి నాయకులను సైతం ఖమ్మం లో జరగనున్న జన గర్జన సభ ఆకర్షించనుంది. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా , ఈ సభ మూలనున్న కాంగ్రెస్ కార్యకర్తను సైతం ఉరుకులు పెట్టేలా ఉత్తేజాన్ని నింపుతుందని పలువురు అంటున్నారు. తన రాజకీయ చతురతతో పాటు తనకున్న పాలనాపరమైన అవగాహనతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కి ఢీటైన సమాధానం చెప్పే సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఇప్పటికే అధిష్టానం దృష్టిలో గట్టి నాయకుడిగా గుర్తింపు పొందారు .
. ఈ పాదయాత్రతో ఆయన పేరు అధిష్టానం వద్ద మరింత ముద్ర పడిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు. విక్రమార్క రాజకీయ చరిత్రలో పాదయాత్ర ఒక మైలురాయి కాగా ఖమ్మం ముగింపు సభ చరిత్రలో మిగిలిపోయే ఘట్టంగా కొందరు పేర్కొంటున్నారు.
