క్రైమ్ వార్తలు తెలంగాణ

ఘోరం…ముగ్గురు ప్రాణాలు తీసిన బాణాసంచా

Written by Mohiddin Shaik

బాంబు దాడిని తలపించిన గ్యాస్ సిలిండర్ పేలుడు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన ఆ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది … ఇద్దరి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురి కాళ్లు తెగిపోయి దూరంగా విసిరి వేసినట్లు చల్లాచెదురుగా పడిపోయాయి …అక్కడ ఎటు చూసినా శరీర భాగాలు ,మాంసపు ముద్దలు రక్తపు మడుగులు కనిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడేదో ఆత్మాహుతి దాడి జరిగినట్లు భయానక స్థితి కనిపించింది. ఎటు చూసినా ఆహాకారాలు రోదనలు కాళ్లు , అవయవాలు తెగిపోయి పడిన బాధితుల ఆహాకారాలు, బంధువుల రోదనలు అక్కడికి వచ్చిన నాయకులతో పాటు చూ పరులందరినీ కల చి వేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి …కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బుధవారం బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ సభకు ప్రజాప్రతినిధులు ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆ సభా ప్రాంగణానికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు బి ఆర్ ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి నప్పుడు ఏదో ఒక బాణాసంచా వెళ్లి ఆ గుడిసె పై పడినట్లు కొందరు చెబుతున్నారు. దాంతో మంటలు చెలరేగి ఇల్లు కాలిపోతుండగా సభ దగ్గరలో ఉన్న నాయకులు కార్యకర్తలు వెళ్లి ఆ ఇంటి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటికి తెస్తున్న సందర్భంలోనే అది పేలిపోయి ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమైంది . ఆ సిలిండర్ పెంకులు తగిలి ముగ్గురికి కాళ్లు పూర్తిగా తెగిపోగా మరో ముగ్గురు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందగా, మరో కరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో సందీప్ అనే వ్యక్తి వలస కూలి కూడా మృతి చెందినట్లు ప్రచారం జరిగింది పూర్తి వివరాలు తెలియ రాలేదు, బి రమేష్, అజ్మీర మంగు వీరిద్దరూ, మృతి చెందారు బి ఆర్ ఎస్ కార్యకర్తలు వీరిద్ద రూ చీమలపాడు గ్రామానికి చెందిన వారే. ఇది ఇలా ఉండగా మరో లక్ష్మణ్ అనే వ్యక్తి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. గాయపడిన వారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు . వారిలో ఒకరు నవీన్ కాగా, మరొకరు ఆంగోత్ కుమార్ ఇతనికి ఒక కాలు పూర్తిగా తెగిపోయినది. కాగా సింగరేణి సిఐ గన్ మాన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు . అదే విధంగా ఖమ్మం ముస్తఫా నగర్ కు చెందిన జావా నవీన్ తన ఎడమ కాలు పూర్తిగా తెగిపోయింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఇల్లందు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు . ప్రజాజ్యోతి విలేకరి తేళ్ల శ్రీనివాస్ కూడా గాయపడ్డారు. ఈ సంఘటన పై ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నారు .అనుకోకుండా జరిగిన ఈ సంఘటన అనేక కుటుంబాల్లో, విషాదం నింపింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పేర్కొన్నారు. ఇటువంటి సంఘటన జరగడం రాష్ట్రంలోనే తొలిసా
రి

……. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ..
చీమలపాడు ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదిక చేయాలని అధికారులను ఆదేశించారు. .
. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

……………..
మోయిన్

About the author

Mohiddin Shaik

Leave a Comment