ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తారా…! ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయం అనే చర్చ ఇప్పుడు ఊపు అందుకుంది… బహిష్కరణ తర్వాత ఆయన మీడియా ఎదుట చేసిన ప్రతిజ్ఞ పై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి…. ఇంతకీ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి,… దానివల్ల ఆయన ఏ పార్టీలో చేరుతారు ఎలా తెలుస్తుంది… ఇలాంటి సందేహాలు రావడం సహజం . . ఇంతకీ ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బి ఆర్ఎస్ పక్షాన ఒక్కరంటే ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని శ్రీనివాసరెడ్డి భీష్ముడిలా గంభీరమైన ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ చేసిన వీడియోలు అనేక ఛానల్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… ఇంకా ఆ వీడియో క్లిప్పింగులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ బి ఆర్ఎస్ అభ్యర్థులను కానీ, దాని మిత్రపక్షల అభ్యర్థులను కానీ , గెలవ నివ్వనని ప్రకటించారు. ఈ ప్రతిజ్ఞ నెరవేరాలంటే ఆయన బిజెపిలో చేరితే సాధ్యపడుతుందా….! లేదా ఆయనే ఓ కొత్త పార్టీ పెడితే సాధ్యపడుతుందా….! అది కాకుండా వైయస్సార్ టిడిపి లో చేరితే వీలవుతుందా…!. ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే పొంగులేటి ప్రతిజ్ఞ నెరవేరడం సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంగులేటి శపధం నూరు శాతం కాకపోయినా, కొంత వరకు నెరవేరాలంటే ఆయన కాంగ్రెస్ లో చేరితేనే సాధ్యపడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఉమ్మడి జిల్లాలో ప్రజాదరణ ఉన్న మాట నిజమే , కానీ , అదే సందర్భంలో కమ్యూనిస్టుల తో అవగాహన కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్న బి ఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయటానికి వీలులేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలానికి కాంగ్రెస్ బలం తోడైతేనే ఆయన చేసిన శపధం కొంతవరకైనా నెరవేరే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. పొంగులేటి ఇప్పటికే ఈ రకమైన విశ్లేషణ చేసుకొని లోలోపల నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే ని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని అంత గట్టిగా బి.ఆర్.ఎస్ పై ప్రతిజ్ఞ చేయరని వారు పేర్కొంటున్నారు. పొంగులేటి ఏది పడితే అది మాట్లాడారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పొంగులేటి బిజెపి వైపు అడుగులు వేస్తే ఆయన చేసిన గంభీరమైన ప్రతిజ్ఞ ప్రగల్బాలుగా మిగిలి పోయే అవకాశాలే ఎక్కువ అని వారు పేర్కొంటున్నారు. బిజెపికి స్థానికంగా బలం చెప్పుకోదగిన స్థాయిలో లేదు ఆ పార్టీకి పొంగిలేటి బలం అవుతారు కానీ పొంగులేటికి ఆ పార్టీ ఎన్నికల యుద్ధంలో గెలిపించలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .అయితే కాంగ్రెస్ శీనన్న కోరిన విధంగా తన అనుచరులందరికీ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు మిగిలిన పార్టీలకు ఈ జిల్లాల్లో అభ్యర్థులు కూడా పెద్దగా లేనందున కోరినన్ని సీట్లు ఇవ్వచ్చు. కానీ సీట్లతో పాటు ఓట్లు కావాలి గెలుపు ముఖ్యం కాబట్టి పొంగులేటి తీసుకునే నిర్ణయం చారిత్రిక తప్పిదం కాకూడదని ఆయన అభిమానులు , విశ్లేషకులు అంటున్నారు . మొత్తం మీద ఆయన ఏ వైపుకు వెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనందున త్వరలోనే ప్రకటన చేసే అవకాశం , ఉందంటున్నారు.
………………
మోయిన్
