తెలంగాణ రాజకీయం

తడిగుడ్డతో గొంతు కోశావు…పొంగులేటి నోట మాటలతోటాలు..

Written by Mohiddin Shaik

సీఎం పై నిప్పులు చేరిన మాజీ ఎంపీ

నువ్వు తడిగుడ్డతో నా గొంతు కోసింది అబద్ధమా… నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసింది అబద్దమా …నేను చాలా ఓపిక పట్టాను ….నాకు గల ప్రజాదరణను చూసి ఓర్వలేక పోయావు ……నేను ప్రజల గుండెల్లో స్థానం పొందిన నాయకుడిని …..నన్ను ఆదరించే తీరు చూసి భయపడ్డావు…..నన్ను రాజకీయంగా సమాధి చేయాలనుకున్నావు ….నాకు ప్రజలను ప్రేమించడం తెలుసు ,వారి ప్రేమను పొందడం తెలుసు …… నీకు నన్ను బంధించటం సాధ్యం కాదు . …
ఆవేశంగా ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ ఈ పంచ్ డైలాగులు అదే మాటల తూటాలు పీల్చింది ఎవరు అనుకుంటున్నారా … ! ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశించి ఈ మాటలు అన్నది ఖమ్మం మాజీ ఎంపీ బి ఆర్ ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నాయకుడితో పాటుగా మాజీ మంత్రి టిఆర్ఎస్ అసమ్మతి నేత జూపల్లి కృష్ణారావును సోమవారం బి ఆర్ ఎస్ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ సందర్భంగా ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అటు జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ పై బి ఆర్ ఎస్ పార్టీ పై మాటల తూటాలు పీల్చారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఎస్ శ్రేణుల్లో కాక పుట్టించాయి. అదేవిధంగా వివిధ మాధ్యమాల్లో ఆయన ప్రసంగాన్ని కౌంటర్ ఎటాక్ చేసిన విధానాన్ని చూసి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత పార్లమెంటు ఎన్నికల తర్వాత బి ఆర్ ఎస్ లో ఉంటూనే తన అసంతృప్తిని తెలియజేస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పుడే తాజాగా టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరి ఎంపీ బీఫామ్ పొందిన నామా నాగేశ్వరరావు గెలుపులో కూడా పొంగులేటి కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని మున్సిపల్ ఎన్నికల్లో గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు ఆయన కోరిన వారికి ఒక్క బీఫామ్ కూడా కెసిఆర్ ఇవ్వలేదనేది పొంగిలేటి ఆగ్రహానికి కారణం. ఇదిలా ఉంటే అసలు కెసిఆర్ పొంగులేటిని ఎందుకు దూరం పెట్టారు అనే విషయాలకు కొందరి వాదన ఇలా ఉంది .2018 ఎన్నికల్లో పొ పొంగులేటి తన అనుచరులకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరగా కెసిఆర్ వారికి టిక్కెట్లు కేటాయించలేదు. దాంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకున్న ప్రజాబలాన్ని తెలియజేసే విధంగా పది అసెంబ్లీ స్థానాల్లోనూ తన వర్గీయులతో బలప్రదర్శన ప్రదర్శించారు. అది కేవలం పార్టీ అధినేత దృష్టిలో పడేందుకు మాత్రమే చేసి ఉండవచ్చు . కానీ అప్పటివరకు నాటి టిఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని తన , కనుసన్నల్లో నడుపుతున్నారని వాతావరణం ఉంది . కాగా పొంగిలేటి బల ప్రదర్శనతో తుమ్మల నాగేశ్వరరావు తన ఆధిపత్యాన్ని కూడా చూపించుకునే పద్ధతిలో జిల్లాలో ఇటు తుమ్మల అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలుగా పార్టీ ఏర్పడిందనే ప్రచారం జరిగింది. ఆ వాతావరణం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఘోరమైన ఫలితాలను చవిచూసింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా టిఆర్ఎస్ గాలి వియగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ టిడిపి గాలి వీచింది ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే కారు గుర్తుపై విజయం సాధించారు. అప్పటికి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం పాలేరు స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఈ ఓటమికి ఈ ఇద్దరు నాయకుల ఆధిపత్య ధోరణులు అంతర్గత కుమ్ములాటలే కారణమని అధినేత కేసిఆర్ భావించినట్లు ప్రచారం జరిగింది. అందుకే అసెంబ్లీ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మంచి ప్రజా ఆదరణ కలిగిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారని చర్చ జరిగింది . అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావును కూడా ఆనాటి నుంచి ముఖ్యమంత్రి అంతగా పట్టించుకోలేదని ప్రచారం ఉంది . అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టిఆర్ఎస్ పార్టీ చేజేతుల పోగొట్టుకుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుత పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న బిజెపి కాంగ్రెస్ పార్టీలు బి ఆర్ఎస్ లోని అసమ్మతి నాయకులను బహిష్కృత నేతలను ఏదో విధంగా చేర్చుకోవాలని ప్రయత్నాలు మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. పొంగిలేటి రాజకీయ పయనం ఇతనే అంశంపై కూడా సంవత్సర కాలంగా చర్చ జరుగుతోంది .ఇక చివరి అంకానికి చేరినందున పొంగిలేటి బిజెపి వైపు అడుగు వేస్తారా , కాంగ్రెస్ వైపు అడుగు వేస్తారా త్వరలోనే తేలనుంది.
……………….
మొహిద్దిన్

About the author

Mohiddin Shaik

Leave a Comment