రాజకీయం

ఐదున సిపిఐ శత వసంత సభ సన్నాహాక సమావేశం…-హాజరుకానున్న రాజా, నారాయణ, పువ్వాడ

Written by Mohiddin Shaik

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత వసంతాల ముగింపు సభకు సంబంధించి ఆహ్వాన సంఘ -సన్నాహాక సమావేశం అక్టోబర్ ఐదున ఎస్ఆర్ గార్డెన్స్లో జరుగుతుందని సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు ఎస్, సాబీర్ -పాషా, దండి సురేష్ లు నేడొక ప్రకటనలో తెలిపారు.

ఆహ్వాన సంఘ సన్నాహాక సమావేశం ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుందని ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహిస్తారన్నారు. -ఆహ్వాన సంఘ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, గౌరవ అతిథులుగా బినాయ్ విశ్వం, కె. నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి హాజరవుతారని పాషా, సురేష్ లు -తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆహ్వాన సంఘ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండ్యన్, పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం, కర్ణాటక రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి -సుందరేష్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పర్ష పద్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, ఈటి నర్సింహా, బాగం హేమంతరావు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment