సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు గారితో తో కలిసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల గల నాయకుడని విద్యార్థి దశ నుండే ప్రజా సంక్షేమం కోసం పరితపించిన యోధుడని అన్నారు. తుది శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహానీయుడని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని శోకతప్త హృదయంతో భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , టి పి సి సి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ , పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు,పుచ్చకాయల వీరభద్రం తదితర నాయకులు పాల్గొన్నారు.
