రాజకీయం

ఆత్మీయ భరోసా పట్టణ కూలీలకు కూడా ఇవ్వాల్సిందే..!వ్యవసాయ కూలీలకు శాపంగా మారిన ఉపాధి కూలీ నిబంధన…హైకోర్టు ఆదేశాలతో పట్టణ కూలీలకు మేలు జరిగే అవకాశం.

ఆత్మీయ భరోసా పథకం పొందేందుకు ఉపాధి హామీ కూలిగా పనిచేయాలనే నిబంధన వ్యవసాయ కూలీలకు శాపంగా మారింది… గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద జాబు కార్డు పొందినప్పటికీ, అనేకమంది వ్యవసాయ పనుల సీజన్లో , వ్యవసాయ పనులకు వెళతారు. అలాంటివారికి ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక జాబితాలో చోటు దక్కలేదు…

ఉపాధి హామీ పనులకు నెలలో 20 రోజులు వెళ్లిన వారికే ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు పొందేందుకు అర్హత దక్కింది.. దీంతో గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించినప్పుడు అచ్చంగా వ్యవసాయ కూలీ పనులు మాత్రమే చేసుకునే , సెంటు భూమిలేని నిరుపేదలు జాబితాలో తమ పేర్లు రాలేదంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు .

నిరసనలు తెలిపారు.. ఇదిలా ఉంటే ఉపాధి హామీ పనులకు అవకాశం లేని మున్సిపల్ పరిధిలో కూడా ఎటువంటి ఆధారం లేని కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గ్రామీణ ఉపాధి హామీ పనులకు పోకుండా పొలం పనులకు వెళ్లిన కూలీల పేర్లు ఆత్మీయ భరోసాకు అర్హుల జాబితాలో రాలేదు..

మరి ఉపాధి హామీ పనులు చేసే అవకాశమే లేని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి నిరుపేద కూలీలకు ఆత్మీయ భరోసా ఏ విధంగా ప్రభుత్వం అందిస్తుందో చూడాలి. వారికి కూడా ఇవ్వాల్సి వస్తే , కచ్చితంగా ఉపాధి హామీ పనులు చేసి ఉండాలి అనే నిబంధనను ప్రభుత్వం సడలించాల్సి వస్తుంది.

అలా ఆ నిబంధనను ప్రభుత్వం సడలిస్తుందా, ఒకవేళ ఆ నిబంధనను సడలిస్తే, ఉపాధి హామీ పనులకు సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్షలాదిమంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఇచ్చి తీరాల్సిందే.. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రస్తుతం వేసుకున్న అంచనా వ్యయం కంటే మరో మూడింతలు ఆర్థిక భారం పడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకునేందుకు విపక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

About the author

Mohiddin Shaik

Leave a Comment