ప్రత్యేక కథనాలు రాజకీయం

జనం మెచ్చిన జన నేత భట్టి విక్రమార్క…కార్యసాధకుడు, కమ్యూనిస్టుల కోటలో జెండా పాతిన చాణిక్యుడు..

Written by Mohiddin Shaik

కార్యసాధకుడు కష్టాన్ని లెక్కచేయడు.. కలలో కూడా లక్ష సాధన గురించి ఆలోచిస్తాడు ..ప్రతిభ ,ప్రజ్ఞ తో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు… ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం… ఆ గ్రామం నుంచి వైరా దాకా సుమారు 5 , 6 కిలోమీటర్లు , కాలినడకన వచ్చి అక్షరాలను అభ్యసించిన ఓ సామాన్య కుర్రవాడు ….ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయ్యాడు…దానికి అదృష్టం ఒక్కటే కారణం కాదు..

ఎర్రటి ఎండలను లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర, ప్రజలను ఆలోచింపజేసింది… ఆ తలపాగా, పంచ కట్టు ,నడిచే విధానం జనంలో కలిసిపోయి, వారి బాధలు తెలుసుకునే పద్ధతి మరో వైయస్సార్ ను తలపించింది.. సామాన్యులకు కూడా సునాయాసంగా అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి…

ఆయన కార్యదీక్ష ఢిల్లీ నాయకత్వాన్ని కూడా ఆలోచింపజేసింది, ఆకర్షించింది… మరో వైయస్సార్ మాదిరిగా ప్రజా ప్రస్థానం పేరుతో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడిచిన నడక చారిత్రకమైనది… ఆ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేయడం వల్లే, ప్రజలకు ఇష్టమైన పాలన అందించేందుకు విక్రమార్క బాటలు వేస్తున్నారు…

రాజకీయాల్లో ప్రజలతో మమేకమై లౌక్యంగా వ్యవహరించడంలో ఆయన మరో బోడేపూడి వెంకటేశ్వరరావు అనే పేరు తెచ్చుకున్నారు… అతిరథ మహారధులుగా పేరున్న కమ్యూనిస్టు నేతలు ప్రాతినిధ్యం వహించిన మధిర గడ్డపై ,కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఘనుడు బట్టి విక్రమార్క. బహుముఖ సామర్థ్యాలు కలిగిన విక్రమార్క రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించగల ప్రజ్ఞావంతుడనేనిరూపించుకుంటున్నారు..

ఈ దేశాన్ని ఏలిన ఇందిరా గాంధీ, సోనియా ,రాహుల్ గాంధీ లకు నమ్మకమైన నాయకుడు అయ్యాడు… సాక్షాత్తు మధిర బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ భారత్ జూడో యాత్ర అక్కడ రాహుల్ గాంధీ చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా చైతన్యం నింపే యాత్ర బట్టి విక్రమార్క , చేశారని ప్రకటించారు… అంతటితో ఆగకుండా బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో తాను ప్రసంగిస్తుండడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కూడా ఆమె లక్షలాదిమంది ప్రజల మధ్య ప్రకటించారు …

.ఖమ్మంలో జరిగిన చారిత్రిక సభలో వేదికపై రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకొని తనతో సమానంగా వేదిక పై ముందుకు వచ్చి లక్షలాదిమంది ప్రజలకు అభివాదం చేయడం చూశాం… కాంగ్రెస్ పార్టీలో అటువంటి స్థానం పొందటం అంత సులువైన పని కాదు… రాష్ట్రంలో సీఎల్పీ నేతగా, ఆ తరువాత ప్రభుత్వం వచ్చాక ఉప ముఖ్యమంత్రిగా ,తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా పేరు తెచ్చుకోవడం సాదాసీదా నాయకులకు సాధ్యమవుతుందా…!

అన్న మల్లు అనంత రాములు రాజకీ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని , కమ్యూనిస్టుల కంచుకోట మధిరని యోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన యోధుడు …. తాను ఎమ్మెల్సీగా వ్యూహాత్మక విజయం సాధించిన నాటి నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానం, ఆ మధిర నియోజకవర్గం లో రాజకీయ సమీకరణలు ఎటు మారిన , అంతిమంగా ఆ మార్పు తనకు అనుకూలంగా మారింది..

తన రాజకీయ చతురతతో చిన్న వయసులోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి మనసు గెలిచిన మొనగాడు విక్రమార్క… ఆ తరువాత మారిన ప్రణామాలు పార్టీని నిలబెట్టేందుకు సీఎల్పీ నేతగా, ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు… ఆయన డిప్యూటీ సీఎం కావడం ఆయన నిత్య పరిశ్రమ కష్టపడే తత్వం కారణం కావచ్చు.. కానీ ఆయన డిప్యూటీ సీఎం కావడం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి కచ్చితంగా అదృష్టం అని చెప్పవచ్చు…

పదవిలోకి రాగానే సాగర్ ఎడమ కాలువ పరిధిలో మూడవ జోన్ లో ఉన్న మధిర ప్రాంతాన్ని రెండవ జోన్ లోకిమార్పించిన ఘనుడు.. సీతారామ ఎత్తిపోతల ద్వారా వైరా చెరువుకు లింకు కెనాల్ తెచ్చే భగీరథ ప్రయత్నం చేస్తున్న అభివృద్ధి ప్రదాత… తన సామర్థ్యాలకు మేధస్సుకు తగిన ఇంతకంటే అత్యున్నతమైన పదవులు అధిరోహించాలని ఆశిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎప్పటికైనా నెరవేరుతుందని చెప్పవచ్చు..

.

About the author

Mohiddin Shaik

Leave a Comment