తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

పల్లె వెలుగు ఎక్కిన డిప్యూటీ సీఎం… పల్లె జనం గుండెల్లో నిండిన ఆనందం.. పక్కన కూర్చుని పథకాలు అందుతున్నాయా అంటూ అడిగిన అమాత్యుడు…

Written by Mohiddin Shaik

తమ అభిమాన నాయకుడే కాదు , రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి… అనుకోకుండా వచ్చి పల్లె వెలుగు బస్సు ఎక్కాడు… బస్సులో ఉన్న పల్లెజనం ఇది కలో ,నిజమో అర్థం గాక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు…

సాధారణ వ్యక్తిలా బస్సులో కూర్చొని కండక్టరమ్మకు డబ్బులు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారు… ఓ అవ్వ పక్కన కూర్చొని మీరంతా బావున్నారా ..అంటూ ఆత్మీయ బంధువుల కుశలమడిగారు … మీకు ఫ్రీ కరెంటు వస్తుందా, , ఉచిత బస్సు సౌకర్యం ఎన్నిసార్లు పొందారు.. . అంటూ డిప్యూటీ సీఎం బస్సులోని సాధారణ ప్రజలతో ఆప్యాయంగా అడుగుతుంటే, వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు…

ఇందిరమ్మ రాజ్యంలో తమకు అందుతున్న పథకాలు , సౌకర్యాలను చెబుతూ …పల్లె జనం తమ ఆనందాన్ని , సంతోషాన్ని తెలియజేశారు.. సమయం దొరికినప్పుడల్లా ఆ పల్లె జనంతో మమేకమై, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ప్రజా నాయకుడైన బట్టి విక్రమార్క కూడా తను ప్రాణప్రదంగా ప్రేమించే ప్రజల తో కలసి మాట్లాడుకుంటూ ప్రయాణించినంత సేపు గొప్ప ఆనందం పొంది ఉంటారు … ఖమ్మం పాత బస్టాండ్ నుండి బుధవారం ఆయన బోనకల్లు బస్సులో ప్రయాణించారు…

మధిర ప్రాంతాన్ని తాను నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్న బట్టి విక్రమార్క ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మధిర నియోజకవర్గ తో పాటు ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి తాగునీటి సమస్య తలెత్తకుండా చేసేందుకు ఆయన నడుం బిగించారు.

తాను డిప్యూటీ సీఎం కాగానే ఎన్ఎస్పి ఎడమ కాలువ పరిధిలో మధుర నియోజకవర్గ ప్రాంతాన్ని రెండవ జోన్ పరిధిలోకి తెచ్చి తన మార్కును బట్టి చాటుకున్నారు. అదేవిధంగా సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ లోకి లింక్ కెనాల్ ఏర్పాటు చేసి ఈ ఖరీఫ్ సీజన్ నుంచే లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార పౌర సంబంధాల శాఖ రెవెన్యూ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తో సమన్వయం చేసుకుంటూ ముగ్గురు మంత్రులు కలసి సాగునీటి రంగంలో జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బలమైన అడుగులు వేస్తున్నారు.

విద్యా వైద్య రంగాలలో కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన అందించేందుకు కార్యదీక్షతో పని చేస్తున్నారు. ఒకనాటి కమ్యూనిస్టు ఖిల్లాగా పేరుగాంచిన మధిర నియోజకవర్గంలో పట్టు సాధించి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో మరో బోడెపూడి వెంకటేశ్వరరావును తలపించేలా సౌమ్యుడిగా, ప్రజాదరణ జరిగిన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. బుధవారం నాటి డిప్యూటీ సీఎం పల్లె వెలుగు బస్సు ప్రయాణం ఆ పల్లెజను లకు పది కాలాలపాటు గుర్తుండిపోతుంది.

About the author

Mohiddin Shaik

Leave a Comment