ఈసారి ఎన్నికల సందడి వేసవికాలం ప్రారంభం లో మొదలై వర్షాకాలం ప్రారంభంతో ముగిసిపోతుంది…ఎండలు ఏప్రియల్ నెలలోనే వేడెక్కుతాయి. పార్లమెంటు ఎన్నికల నగారా అదే నెలలో మోగింది.. ఏప్రిల్ లో మొదలైన ఎన్నికల సందడి మే 13 పోలింగ్ ముగిసే దాకా కొనసాగింది.. ఆ వెంటనే మొదలైన ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది..
నామినేషన్లు, ఆ తర్వాత ప్రచారాల మైకుల హోరు మండే ఎండలతో పోటీ పడింది..
గెలుపు లక్ష్యంగా అపర కోటీశ్వరులు ఏసీ నుంచి కాలు బయటపెట్టని నేతలు మండు టెండ లో మాడిపోయారు.. అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డున ఆ నేతలకు జనం తలలు చూసినప్పుడు తమకు పడి ఓట్లు కనిపించాయి… వ్యూహాలు ఎత్తులు ఎన్ని చేస్తే గెలుస్తామో., అనే ఆలోచనల ముందు వేసవి చిన్న పోయింది…హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచార వేడి నిప్పులు చెరిగే ఎండలతో పోటీ పడింది..
ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది.. ఆ సందడి మే 27 వరకు కొనసాగుతోంది.. ఇక యుద్ధాన్ని తలపించే స్థాయిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అంటే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు వ్యాపించి వర్షాకాలం ప్రారంభమవుతుంది…వర్షాకాలం లో వచ్చే ఈ ఫలితాలు ఏ పార్టీని అందలమెక్కిస్తాయో ఏ పార్టీని ఓడిస్తాయో వేచి చూడాలి…
ఎన్నికల్లో యుద్ధంలో తలపడే వైర్ వర్గాలకు వేసవిలో అగ్నిదేవుడు స్వాగతం పలకగా, ఆ వైరి వర్గాల్లో ఏదో ఒక వర్గానికి విజయం చేకూర్చి ,అందలమెక్కించి ,వానదేవుడు చల్లని కబురు చెప్పి ,స్వాగతం పలకనున్నాడు. మరి ఆ అదృష్టవంతులు అందలమెక్కి ఆ రాజకీయ పక్షం ఏదో ..తెలియాలంటే జూన్ నాలుగు దాకా ఆగాల్సింది..
