ఖమ్మం ,వరంగల్ ,నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ల తుది సమరం నేడు మే 27న జరగనుంది…పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. ఇదివరకు ఈ స్థానం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ప్రస్తుత ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ శాసనమండలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షల 63 వేల 8 39 ఓట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పురుషుల ఓట్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల 159 ఉండగా, మహిళల ఓట్లు 1 లక్ష 75 వేల 645 ఉన్నాయి. కాగా వీరంతా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఉమ్మడి మ్మం జిల్లాలో నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 22 వేల 590 పురుష ఓటర్లు ఉండగా, మహిళ ఓటర్లు 17వేల 518 మంది ఉన్నారు. మొత్తం 40 వేల 106 ఓట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉండగా, ఖమ్మం జిల్లా పరిధిలో 50వేల 676 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళ ఓటర్లు 33 వేల 199 మంది ఉన్నారు. మొత్తం ఖమ్మం జిల్లా పరిధిలో 83 వేల 8 వందల 79 మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కాగా మిగిలిన ఓటర్లు ఉమ్మడి నల్గొండ , ఉమ్మడి వరంగల్, జిల్లాల పరిధిలో ఉన్న జిల్లాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..
…. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు…
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు తో కలిపి మొత్తం 52 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా , ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రంగంలో ఉండగా, బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి రంగంలో ఉన్నారు. కాగా బిజెపి తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రంగంలో ఉన్నారు.
ఈ ముగ్గురు అభ్యర్థుల పక్షాన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోసం సాధారణ ఎన్నికలను తలపించేలా ఓటర్లకు తాయాలాలు కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు , కనిపించింది .
దాదాపు ప్రచారం అంత స్థాయిలో జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కూడా కేటీఆర్ నేతృత్వంలో , మాజీ మంత్రి హరీష్ రావు తో సహా అనేకమంది మాజీ మంత్రులు , మాజీ శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ ఇలా నేతల ప్రచారం హోరెత్తింది. బిజెపి తరఫున కూడా ఆ పార్టీ రాష్ట్ర అగ్రనేతల్లో ఒకరు ఈటల రాజేందర్ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు మిగతా నాయకులు కూడా తమ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాగా నేడు విద్యావంతులు ఎవరిని గెలిపించబోతున్నారో వేచి చూడాలి.
