తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

మూగబోయిన ప్రచార మైకులు..ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికలు.. ఎన్నికలకు సర్వం సిద్ధం..

Written by Mohiddin Shaik

ఖమ్మం జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 18వ లోకసభ ఎన్నికలు ఈనెల 13వ తేదీన జరగనున్నాయి.. శనివారం వరకు ఎన్నికల ప్రచార హోరు మోత మోగించింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పది గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన నేతల కు ఓట్లు వేయాలంటూ వీధుల్లో మైకుల్లో హోరెత్తించారు.

రోడ్డు షోలు బహిరంగ సభలు మండుటెండల్లో సైతం పోరా హోరీగా సాగాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటలు ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా శనివారం సాయంత్రం తో ఎన్నికల ప్రచారం ముగిసింది మైకులు డీజే వంటి వి అన్నీ మూగబోయాయి.

ఇక ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ప్రధాన పార్టీల నాయకులు సర్వశక్తులు వడ్డీ పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందనే విశ్వాసం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయంగా జిల్లాలో మారిన సమీకరణలు కూడా ఆ ధీమాకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక మరో ప్రధానమైన పార్టీ బి ఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా తన గెలుపు పై ధీమాగా ఉన్నారు. బిజెపి కూడా తన ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

….. ప్రశాంత ఎన్నికలకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు…

ఇదిలా ఉంటే ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వీపి గౌతమ్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ప్రశాంత ఎన్నికలకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు .మ్మంలో సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసి ఎక్కడైనా ఘర్షణకు అవకాశం ఉన్న ఏదైనా చిన్న గొడవ జరిగినా వాటిని పోలీస్ ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ లో ఉండే , చూసి ఆయా ప్రాంతాలకు వెంటనే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ని పంపించడం గొడవ జరగకుండా అడ్డుకోవడం వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు పోలీస్ శాఖ తీసుకుంది అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి ఆయా గ్రామాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. మొత్తం మీద సోమవారం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

About the author

Mohiddin Shaik

Leave a Comment