తెలంగాణ రాజకీయం

టూరిస్టులను గెలిపిస్తే ప్రయోజనం ఉండదు…నిత్యం మీ కోసం పని చేసే వ్యక్తిని నేను…మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి…బి ఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు..

Written by Mohiddin Shaik

ఎన్నికల సమయంలో పదవుల కోసం వచ్చి వెళ్లే టూరిస్టులను గెలిపిస్తే జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుందని నిత్యం ప్రజల కోసం పనిచేసే తనను గెలిపించాలని బి ఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం ఆయన జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.తనను మళ్ళీ గెలిపిస్తే ప్రజల సమస్యలపై ఢిల్లీలో వినిపించే ప్రజా గొంతుకనవుతానని బి ఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు.

ప్రజల లక్ష్యం , ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతు బిడ్డగా అందరివాడినైనా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
అన్ని నియోజక వర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తన గెలుపు కోసం రాత్రిoబవళ్ళు కష్ట పడి పని చేశారని, వారందరికీ కృతజ్ఞత లు తెలిపారు.నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ పెట్టి పెద్ద ఎత్తున సేవా కార్యక్ర మాలు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఒకవైపు నామ ముత్తయ్య ట్రస్ట్ , బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ గా ట్రస్టీగా , మరోవైపు రాజకీయాల్లో పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు ..

ఖమ్మం జిల్లాలో 8 వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందని చెప్పారు . దేశంలో ఏ ఎంపీ కి దక్కని గుర్తింపు ఖమ్మం జిల్లా బిడ్డనైన తనకు దక్కిందని, పార్లమెంట్ కు ఎక్కువ శాతం రోజులు హాజరై , అధిక ప్రశ్నలు అడిగి, ఉత్తమ పార్లమెంటేరియన్ అనిపించుకున్నానని అన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల మనసు గెలుచుకున్న నామ నాగేశ్వరరావు ను మళ్లీ , గెలిపించాలని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ
ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయా ల్లోకి వచ్చిన నామ , కు బిజెపి సింధులాండగా నిలవాలని కోరారు.
జడ్పీ
చైర్మన్ లింగాల కమల్ రాజు , డి సి సి బి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,
తదితరులు పాల్గొన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment