వామపక్షాలు కాంగ్రెస్ కలిసి ఎన్నికల రంగంలో నిలిచినప్పటికీ నామ గెలుపుపై ధీమాగా ఉన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టిన తెలుగు తమ్ముళ్లు ఈ ఎన్నికల్లో నామాకు జై కొడుతున్నట్లు ప్రకటిస్తున్నారు.. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీపై కనిపించిన వ్యతిరేకత, ఆ పార్టీని ఓడించాలని కసి, ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే పోటీ కాంగ్రెస్ ,వర్సెస్ టిఆర్ఎస్ లాగా కాకుండా, రాను రాను రెడ్డి వర్సెస్, చౌదరి అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీగా పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. చౌదరి సామాజిక వర్గానికి చెందిన అనేకమంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చౌదరి అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగానే అక్కడక్కడ ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిణామం ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యమైన మార్పుకు అవకాశం ఇస్తుందేమోనని విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం ఓట్లు ఈసారి నామాకే వేస్తామని హామీలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క ఖమ్మం నగరంలోనే టిడిపి ఓట్లు ఇప్పటికీ దాదాపు 20 వేల నుంచి 25 వేల వరకు ఉంటాయి. ఈ జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ టిడిపికి ఇప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు నామా నాగేశ్వరరావుకు కచ్చితంగా పోల్ అయితే పోటీ రసవత్తరంగా మారక తప్పదని పరిశీలకులు అంటున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీని సొంతం చేసుకున్న పాలేరు ఖమ్మం సత్తుపల్లి అశ్వరావుపేట నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికల్లో పరిస్థితి మారుతుంది అంటున్నారు. ప్రచారంలో కూడా విఆర్ఎస్ నేతలు ప్రధానంగా అభ్యర్థి నామ నాగేశ్వరరావు విస్తృతంగా తిరిగి ప్రచారం చేస్తున్నారు.
….. జిల్లా ప్రజలకు నామ సుపరిచితులు….
అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారు నామా నాగేశ్వరరావు అంటే ఉమ్మడి జిల్లా ప్రజలకు పరిచయం అక్కరలేదు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి కూడా ఈ జిల్లాలోనే పుట్టి ఉండొచ్చు కానీ రఘురామిరెడ్డి అంటే జిల్లా ప్రజలకు పూర్వ పరిచయం లేదు. అదే నామా నాగేశ్వరరావు గతపది సంవత్సరాలుగా ఎంపీగా ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ అంశం కూడా ఈ ఎన్నికల్లో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్‌కి బలం ఉన్నప్పటికీ, వామపక్షాల మద్దతు ఉన్నప్పటికీ, మారుతున్న సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు నల్లేటిపై నడకేమీ కాదు పోటీ గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
