కొత్తనీరు వచ్చినప్పుడు ఆ నీటి వైపు దూకే కప్పలకి, అధికారం ఎటు ఉంటే అటు వెనక ముందు చూసుకోకుండా దూకే రాజకీయ నాయకులకు తేడా లేదనిపిస్తోంది… ఒక్కో సందర్భంలో వీళ్ళకంటే కప్పలే నయం అనిపిస్తుంది…

లేకపోతే ఏంటండీ.. ఉదయం పూట గులాబీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ గొప్పతనాన్ని గుక్క తిప్పుకోకుండా బహు గొప్పగా చెప్పారు… అదే నాయకులు అదేరోజు సాయంత్రం కల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి హస్తం పార్టీలో ఒదిగిపోయారు… ఇలా జరగటం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు… రాజకీయంగా అధికారం మారినప్పుడల్లా బెల్లం కోసం ఈగలు మాదిరి కొంతమంది నాయకులు జంపింగులు చేస్తూనే ఉంటారు…దీనిపై ప్రజల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు ఇవి..
.బి ఆర్ ఎస్ నాయకురాలు ఖమ్మం నగర మేయర్ పి నీరజ తో పాటు మరికొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు.
సంజీవరెడ్డి భవన్ లో నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ ఆద్వర్యంలో , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వములో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు .
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, సరిపుడి రమాదేవి, సతీష్ లు చేరారు . దుర్గాప్రసాద్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా
తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ …..
పార్లమెంట్ ఎన్నికలు జరిగిన స్థానాలల్లో ఇప్పటికె ఇండియా కూటమి మెజార్టీ లో ఉంది అన్నారు. కొత్తగా అనేకమంది కాంగ్రెస్లో చేరుతుండడం ఆ పార్టీ అధికారంలోకి వస్తది అది చెప్పేందుకు సంకేతం అని ఆయన పేర్కొన్నారు.. కాంగ్రెస్లో చేరిన మేయర్ తో సహా కార్పొరేటర్ లను అందరినీ ఆయన అభినందించారు.
కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది.
దేశం లో ఏ ఒక్క ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం నిర్మించలేదన్నారు .
మేయర్ నీరజ మాట్లాడుతూ..
కాంగ్రెస్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది.
అభివృద్ధి ప్రదాత
తుమ్మల నాగేశ్వరావు తో కలిసి పనిచెయ్యడం అంటే అభివృద్ధి ,
తుమ్మల నాగేశ్వరావు తో కలిసి ఖమ్మం నీ అభివృద్ధి పధంలో నిలుపుతాం. అన్నారు
కాంగ్రెస్ పార్టీ లో అందరితో కలిసి పనిచేస్తా.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,నగర డిప్యూటీ మేయర్ జోహర ముక్తార్,కార్పొరేటర్లు రావూరి కరుణ, మలీదు వేంకటేశ్వర్లు, దుద్దుకురి వేంకటేశ్వర్లు, లాకావత్ సైదులు నాయక్, మహ్మద్ రఫేదా బేగం,కమర్తపు మురళి, చావా మాధురి, పాలెపు విజయ, గజ్జెల లక్ష్మి,పాకలపాటి విజయ నిర్మల, కొప్పెర సరిత,షేక్ జాన్,బి, మలీదు జగన్, రాపర్తి శరత్ కుమార్, పైడిపల్లి సత్యనారాయన,మందడపు లక్ష్మి ,లలితా రాణి, పల్లెబోయిన భారతిచంద్రం,మిక్కిలినేని మంజుల నరేందర్, ముస్తఫా, చోటా బాబా , పాలేపు రమణ,నాగుల్ మీరా, చావా నారాయణరావు, రావూరి సైదుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.
