కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పేరును ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించింది. “, ఖమ్మం సీటు రఘు రాముడు కె కేటాయించారా.. ” అనే శీర్షికతో ఐకాన్ న్యూస్ వెబ్ ఛానల్ లో ఏప్రిల్ 22న ప్రచురితమైంది .
పొంగులేటి చుట్టూ ఖమ్మం సీటు వ్యవహారం తిరుగుతుందని అనేకమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్లోని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి గానీ లేదా ఆయన వియ్యంకుడు గ్రామసహాయం రఘురామిరెడ్డి కి గాని ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ వస్తుందని ప్రచారం నిజమైంది. ఈలోపు అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో అనేకమంది ఆశావహులు తమ ప్రయత్నాలను చివరి వరకు కొనసాగిస్తూ వచ్చారు.
కొందరైతే నామినేషన్లు కూడా వేశారు కానీ చివరికి అధిష్టానం అభ్యర్థి పేరు ప్రకటించినందున ఇక కాంగ్రెస్లో టికెట్ ఉత్కంఠకు తెరపడింది.
