నామ నాగేశ్వరరావుకు ఈసారి కూడా అదృష్టం కలిసి వస్తుందా.., ఆయన గతంలో కూడా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎంపీగా విజయం సాధించారు. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు కలిసి వచ్చే అంశంగా కొంతమంది పరిశీలకులు పేర్కొంటున్నారు.

నామ నాగేశ్వరరావు టిడిపి ఎంపీగా ఆ తర్వాత బి ఆర్ ఎస్ ఎంపీగా పదేళ్లపాటు ఖమ్మం పార్లమెంటు తరఫున ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయనపై రాజకీయంగా దుమారం రేపేస్తాయి ఆరోపణలు ఏవి లేవు. తన పరిధిలో ఉన్న పనులు చేసుకోవడం తప్ప రాజకీయంగా ఇతరులను ఇబ్బంది పెట్టే తత్వం ఆయనది కాదు.
నిరాడంబరంగా ఉంటూ అందరితో కలిసి వెళ్లే నామా నాగేశ్వరరావుకు ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉన్న లేకపోయినా ప్రత్యేకించి ఆయన పట్ల వ్యతిరేక భావన మాత్రం లేదని కొందరు. ఈ అంశం దాదాపు ప్రతి ఎన్నికల్లోను ఆయనకి కలిసి వస్తుందని ఈసారి కూడా ఆయనకు అదృష్టం కలిసి రావచ్చునే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
నామ నాగేశ్వరరావు ఈనెల 24న ఖమ్మం పార్లమెంటుకు తన నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలోనూ నామ నాగేశ్వరరావు విస్తృతంగా పాల్గొంటున్నారు.
…. అలిగిన వారిని యుద్ధానికి సిద్ధం చేస్తున్న వద్దిరాజు…
గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని అలక భూమిన వారిని కలుసుకొని వారిని చైతన్యపరిచి ఈ ఎన్నికల యుద్ధంలోకి వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు నమ్మిన బంటుగా రవిచంద్ర పార్టీ శ్రేణుల్లోనూ ఎవరితోనూ విరోధాలు లేని వ్యక్తిగా అందరితో కలిసిపోయి నామ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.
