ప్రత్యేక కథనాలు రాజకీయం

గులాబీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన రాములు నాయక్…చిచ్చు పెట్టిన సమన్వయకర్తల జాబితా..ఆ జాబితా నిజం కాదన్న జిల్లా అధ్యక్షుడు తాతా మధు..

Written by Mohiddin Shaik

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో వికెట్ డౌన్ అయింది.. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇటీవల రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.. కాగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ వీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారని సంకేతాలు కనిపిస్తున్నాయి…
గు

గులాబీ పార్టీ లో సమన్వయకర్తల జాబితా గందరగోళం సృష్టించింది..ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్లకు సమన్వయ కర్తల జాబితాను స్వయంగా కేటీఆర్ రెండు రోజుల క్రితం ప్రకటించినట్లు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది… అందులో సీనియర్ నాయకులు ,గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పేర్లు కాకుండా ఇతరుల పేర్లు ఉండటంతో కొంతమంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విడుదలైన జాబితా నిజమైనది కాదని ప్రకటించారు…

సమాచారం లోపం వల్ల ఆ జాబితా బయటకు వచ్చిందని అసలైన జాబితా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు… ఇదిలా ఉంటే వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు… గతంలో తనపై ఓడిపోయిన వ్యక్తినే మళ్లీ ఇప్పుడు తనపై ఆధిపత్యం చలాయించేందుకు వైరా ఇన్చార్జిగా అవకాశం ఇచ్చారని , తనకు ఈ పార్టీలో గౌరవం లభించదని ఆయన పేర్కొన్నారు…

. … రాములు నాయక్ రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు…

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైరా అసెంబ్లీ టికెట్ రాములు నాయక్ కేటాయించకుండా అంతకుముందు వైరా ఎమ్మెల్యేగా పనిచేసిన బానోతు మదన్లాల్ కు ఆ పార్టీ టికెట్ కేటాయించింది. రాములు నాయక్ టికెట్ ఇవ్వకుండా మదల్లాలకు ఇస్తున్న సందర్భంలో రాములు నాయక్ కుమారుడికి మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ ఇస్తామని వీఆర్ఎస్ అధినేత మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మాటకు అనుగుణంగా రాములు నాయక్ తనయుడు మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణను క్షేత్రస్థాయిలో ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా టిఆర్ఎస్ అధినేత అతనికి టికెట్ ఇవ్వకుండా మాలోతు కవితకే మళ్లీ ఎంపీ టికెట్ను కేటాయించారు.

దీంతో రాములు నాయక్ ఆ పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది గాక ఇటీవల వైరా నియోజకవర్గంలో పార్టీ సభలు జరుగుతున్న సందర్భంలో ఆయా సభల్లో అధ్యక్ష స్థానంలో మదన్లాలను ఉంచి గెస్ట్ గా తనను పిలుస్తున్నారని అంటే వైరా నియోజకవర్గంలో తనకు కనీసం ఇన్చార్జి బాధ్యతలు కూడా ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కలిసి వీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి దారితీసాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమన్వయకర్తల జాబితాతో ఏర్పడిన గందరగోళం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన ప్రకటన ప్రకారంగా కొత్తగా మళ్లీ ప్రకటించబోయే జాబితా ద్వారా సర్దుకుంటుందేమో వేచి చూడాలి.

About the author

Mohiddin Shaik

Leave a Comment