క్రైమ్ వార్తలు

ఫోన్ కాలర్ లింకు ఓపెన్ చేస్తే మీ ఖాతా ఖాళీ అయినట్లే… కోటి 40 లక్షలు 60 రోజుల్లో కాజేశారట… సైబర్ మాయగాల్ల వలలో ఎవరైనా పడితే 1930 కి కాల్ చేయండి..

Written by Mohiddin Shaik

అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవరైనా ఫోన్ కాలర్ లో వచ్చే ఎలాంటి లింకులను ఓపెన్ చేయ కూడదట.. ఎవరైనా పొరపాటున చేశారంటే క్షణాల్లో వారి బ్యాంకు ఖాతా లూటీ అయిపోతుందట.. 60 రోజుల్లో ఇలాంటి నేరగాళ్లు 1 కోటి 40 లక్షలు కాజేశారట.. అందుకే ఎవరైనా పొరపాటున వారి మాయలో పడినట్లు అనిపిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి . .. ఈ జాగ్రత్తలన్నీ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు..

ఈ ఏడాది ఇప్పటివరకు సైబర్ నేరాలకు సంబంధించి 292 ఫిర్యాదులు వచ్చాయి. రెండు నెలల్లో ఒక కోటి 40 లక్షలు నేరగాళ్లు దోపిడీ చేయగా, అందులోంచి 25 లక్షల రూపాయలు నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్ళకుండా సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారని తెలిపారు. ఆరు లక్షల రూపాయలు బాధితుల ఖాతాల్లో తిరిగి జమ అయ్యే విధంగా కూడా పోలీసులు చేయగలిగారు. సైబర్ క్రైమ్ పోలీస్ విభాగానికి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది దాన్ని ఉపయోగిస్తున్నారని సునీల్ దత్ పేర్కొన్నారు. అందుకే 1930 టోల్ ఫ్రీ క్రైమ్ పోలీస్ విభానికి విభాగానికి కాల్ చేయడం వల్ల బాధితులకు మేలు జరుగుతుంది. ఆ కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులకు పోలీసులకు కాల్ లింక్ అయి ఉంటుందట. క్షణాల మీద ఆ విభాగం పోలీసులు చర్యలు ప్రారంభించి నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు బాధితులకు మేలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు..

About the author

Mohiddin Shaik

Leave a Comment