పేరుకే ఇది గిరిజనుల జాతర.. వాస్తవంలో ఇది సకలజనుల జాతర.. ఎటు చూసినా జనమే.. కుటుంబాలకు కుటుంబాలే సమ్మక్క సారలమ్మల సన్నిధిలో తరిస్తున్నారు.. అమ్మ వార్ల గద్దెల వైపు అడుగులు వేస్తూనే భక్తి పరవశంతో పూనకాలతో ఊగే వారి సంఖ్య వేల లో కనిపిస్తుంది..

అనేక రాష్ట్రాల కు చెందిన కోయ, గిరిజన ,కొండ రెడ్డి, ఆదివాసి తెగలకు చెందిన వారు ఈ జాతరలో పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.. జానపదుల నాటి సంస్కృతి, నేటి ఆధునిక నాగరీకుల సంస్కృతి సాంప్రదాయాలు సమ్మిళితమై ఇక్కడ కనిపిస్తాయి. ఈ మహా జాతర ఏర్పాట్లను అడవి గిరిజన బిడ్డ రాష్ట్ర మంత్రిగా, సీతక్క దగ్గరుండి చూసుకుంటున్నారు.

కుంభమేళాను తలపించే మేడారం జాతర తెలంగాణ సాంస్కృతిక శోభను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఈనెల 24వ తేదీ వరకు సాగే ఈ మహా జాతరకు కోట్ల మంది హాజరవుతున్నారు గత వారం రోజుల నుంచే అన్ని దారులు మేడారం వైపే మళ్లాయి.
