పోలీసు బలగాలు కర్కసంగా వ్యవహరించడానికి వారు క్రిమినల్స్ కాదు…ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు… రైతుల కోసం అనేక సిఫార్సులు చేసిన ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న ఇచ్చి గౌరవించారు . .. కానీ ఆయన ఆ రైతులు కోసం చేసిన మద్దతు ధర కల్పించే సిఫారసును అమలు అడిగితే రైతులపై నిర్బంధాలకు దిగుతున్నారు…

స్వామినాథన్ చేసిన సిఫారసును అమలు చేసి ఆ గౌరవాన్ని కొనసాగించండి… కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతుల పక్షాన మనమంతా నిలవాలి… అంటూ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ప్రముఖ ఆర్థికవేత్త మధుర స్వామినాథన్ చేసిన ఉద్వేగ భరిత ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

తమ పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించి దానికి చట్టం చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన చివరకు ఉద్రిక్తంగా మారింది.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై టి యర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, లాఠీ ఛార్జ్ కూడా చేసినట్లు తెలుస్తోంది..
ఒక దశలో కాల్పులు జరపగా, ఒక రైతు మృతి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దాన్ని పోలీసు వర్గాలు ఎవరూ మృతి చెందలేదని వివరణ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. శత్రు సైనికులపై సైనిక బలగాలు భీకరంగా పోరాడినంతగా , దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కేంద్ర పోలీసు బలగాలను ఉపయోగించడం పై , రైతు సంఘాలు ,పౌర సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
రైతుల జీవితా లో వెలుగులు నింపేందుకు వ్యవసాయ రంగం భారతదేశంలో, సంక్షోభం నుంచి బయటపడేందుకు ,వ్యవసాయ కమిషన్ ఎంఎస్ స్వామినాథన్ విశేషమైన కృషి చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి కోసం ఆయన అనేక సిఫారసులు చేశారు. ఆయన చేసిన గొప్ప సేవలకు గుర్తుగా ,భారత ప్రభుత్వం ఇటీవల ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. విచిత్రం ఏమిటంటే రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని ఆయన చేసిన సిఫారసును అమలు చేసేందుకు మాత్రం భారత ప్రభుత్వం సిద్ధంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలు , స్వామినాథన్
చేసిన సిఫారసుల్లో ఒకటైన పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించి దానికి చట్టం చేయాలనే డిమాండు అమలు కోసం కొనసాగుతున్నాయి . కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ ను పరిశీలించి పరిష్కరించే వైపు ఆలోచించకుండా, రైతు ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేయటం పైనే దృష్టి సారించినట్లు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
… స్వామినాథన్ సిఫారసును అమలు చేసి గౌరవించండి..
రైతులపై ప్రముఖ ఆర్థికవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పందించి భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఆమె మాట్లాడుతూ ఆందోళన చేస్తున్నవారు క్రిమినల్స్ కాదు వారు దేశానికి అన్నం పెట్టే రైతులు.
వారి న్యాయమైన డిమాండును కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించండి. అప్పుడే మీరు ఎమ్మెస్ స్వామినాథన్ కు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించినట్లు అవుతుంది అన్నారు. రైతుల బాగు కోసం ప్రభుత్వానికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు సేవను గుర్తించి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చారు. ఆయనకు ఎనలేని గౌరవం కల్పించారు. కానీ రైతుల కోసం ఆయన చేసిన ఒక్క సిఫారసును అమలు చేయకుండా రైతులపై కాల్పుల దాకా వెళుతున్నారు , ఇది సరైనది కాదు అని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
