వద్దిరాజు మంచి మనసున్న మహారాజు… ఎదిగేకొద్దీ ఒదిగే తత్వం.. అందరితో కలివిడిగా ఉంటూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే గొప్ప వ్యక్తిత్వం… రాజకీయంగా కూడా అవకాశం ఇచ్చిన పార్టీకి ,పార్టీ అధ్యక్షుడికి విధేయుడుగా పేరు తెచ్చుకున్నారు… వద్దిరాజు మనసున్న మహారాజే… కానీ గులాబీ బాస్ నిర్దిష్టమైన రాజకీయ లక్ష్యాలు కలిగిన నాయకుడు ..అందరికీ పదవుల విషయంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు.. అయినప్పటికీ రవిచంద్ర విషయంలో కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..

మొదట రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే, రవిచంద్రతో కేసీఆర్ ఇలా అన్నారట ..నువ్వు రెండేళ్లు పదవిలో ఉండే ఎంపీ వి కాదు, ఎనిమిదేళ్లు పదవిలో ఉంటావు అన్నారు .. ఈ మాట స్వయంగా వద్దిరాజు రవిచంద్ర తనతో సన్నిహితంగా ఉండే మీడియా మిత్రులతో ఆనాడే చెప్పారు… ఇప్పుడు కెసిఆర్ ఆ మాట నిలబెట్టుకొని రవిచంద్ర కలను సాకారం చేశారు..

వద్దిరాజు రవిచంద్ర గాయత్రీ గ్రానైట్ సంస్థల అధినేత జాతీయ బీసీ నేత, ప్రజల మనిషి, తిరిగి రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మంగళవారం రిటర్నింగ్ అధికారి నుంచి తాను రెండవసారి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుండి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు . రవిచంద్ర రెండవసారి రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల ఖమ్మం జిల్లాకు చెందిన బి ఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు, ఖమ్మం ఎంపీ ఆ పార్టీ పార్లమెంటరీ నాయకులు నామ నాగేశ్వరరావు తో హా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఇతర నాయకులు వద్దిరాజు రవిచంద్ర యువసేన సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేశారు, అదేవిధంగా రవిచంద్రన్ కలుసుకొని మంగళవారం సండ్ర వెంకట వీరయ్య తాత మధుసూదన్ రావు తో సహా నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు..
పార్టీ అధినేత కేసిఆర్ అప్పజెప్పిన ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా స్వీకరించి ఎంతో నమ్మకంగా పూర్తి చేశారు వద్దిరాజు రవిచంద్ర. అందుకే రాజకీయ సమీకరణలు మారిపోయి , ఉన్న ఒక్క రాజ్యసభ స్థానాన్ని కేటాయించే విషయంలో అనేక ఒత్తుడులు ఉన్నప్పటికీ , కేసీఆర్ వద్దిరాజు రవిచంద్ర కి తిరిగి కేటాయించడం విశేషంగా చెప్పవచ్చు.
