క్రైమ్ వార్తలు

దైవదర్శనానికి వెళ్లి కానరాని లోకాలకు…నల్లగొండ జిల్లామిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం…. ఒకే కుటుంబానికి చెందిన 5 గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Written by Mohiddin Shaik

ఎంతో భక్తితో ఒక కుటుంబం ఆనందాలతో దైవదర్శనానికి వెళ్లి ,దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరిగి కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన ఆయా కుటుంబాలతో పాటు , ఆ గ్రామాల్లో విషాదాన్ని నింపింది ..వివరాలు ఈ విధంగా ఉన్నాయి….

మృతులలో.. ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, ఇద్దరు చిన్నారులు… మరో వ్యక్తి

అదుపుతప్పి బోల్తాపడ్డ కారును… ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం, దైవ దర్శనానికి వెళ్లి వస్తూ….. మరో అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకొనున్న ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది….. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ కుటుంబం ఉసురుతీసింది….. మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణ మానస కాలనీ బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళతో పాటు ఇరువురు వ్యక్తులు ఉన్నారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మృతులుచెరుకుపల్లి మహేష్ (35), అతని భార్య చెరుకుపల్లి జ్యోతి (30),పిల్లలు చెరుకుపల్లి ఇషికా (8),చెరుకుపల్లి లియాన్సీ (2) తోడల్లుడు బొమ్మ మచ్చేందర్ (38), అతని భార్య బొమ్మ మాధవి లు జనవరి 26 న కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని మోపిదేవి లో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ నందిపాడు కు కూత వేటు దూరంలో మిర్యాలగూడలోని అద్దంకి- నార్కట్ పల్లి రహదారిపై కృష్ణ మానస కాలనీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు మరోవైపు ఫల్టీ కొట్టి పడిపోగా, అదే సమయంలో గుంటూరు వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మహిళ ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మాధవి తీవ్ర గాయాలు పాలు కావడంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను ఏరియా ఆసుపత్రి కి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment