ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనాలు రాజకీయం

సంక్షేమం గట్టెక్కిస్తుందా..! సోనియమ్మ వదిలిన బాణంతో ఎవరికీ మేలు… హీటెక్కుతున్న ఆంధ్ర రాజకీయాలు…

Written by Mohiddin Shaik

అచ్చంగా సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకుని జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.. మరి ఆ సంక్షేమ పథకాలు ఈసారి ఎన్నికల్లో జగన్ ను గట్టెక్కిస్తాయా… చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనపై కొంత సానుభూతి ప్రజల్లో కనిపిస్తోంది… మరోపక్క కాపు నేతలు కొందరు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారు…

వైసీపీలో వడపోసి పక్కకు పెట్టిన నేతలు కొందరు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చేరారు… ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కాంగ్రెస్ జెండా పట్టుకుని ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు… ఈమె సోనీ అమ్మ వదిలిన బాణం… ఈ బాణం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది… ఇప్పుడప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ కాంగ్రెస్కు ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఆ పెరిగే ఓట్ల శాతం వల్ల తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుందా..,

లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం చీలిపోయి వైసిపి కే మేలు జరుగుతుందా అనే దానిపై చర్చ జరుగుతుంది.. మొత్తం మీద షర్మిల ఎంట్రీ తో ఒకపక్క సోదరుడు మరోపక్క సోదరి పరస్పర రాజకీయ విమర్శలు పాలనలో ఉన్న లోపాలపై వాగ్బాణాలు సంధించుకోవడం ఖాయం… ఆ ప్రక్రియను ఇప్పటికే షర్మిల ప్రారంభించారు… మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి…

వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడే వర్గాలు కొన్ని అయితే, జనం ఐడియాలజీని మార్చే విధంగా వ్యతిరేక ప్రచారం చేసే వర్గాలు కూడా ఈసారి ఎక్కువే కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి బయటికి వచ్చే నాయకులు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలో చేరుతుండడం తెలుగుదేశం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది..

తెలంగాణలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని బలంగా బి ఆర్ ఎస్ పార్టీ నమ్మింది.. కానీ ఆ సంక్షేమ పథకాలు ఆ పార్టీని అధికారంలోకి తేలేకపోయాయి.. తెలంగాణలో నిరుద్యోగులు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు. విశేషమేమంటే వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగులు కూడా బాహాటంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటు వేశారు..

పోస్టల్ బ్యాలెట్ ల పరిస్థితిని పరిశీలించినప్పుడు అప్పటి ప్రభుత్వం పై ఉద్యోగులకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో విఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఉద్యోగులు నిరుద్యోగులు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని పేదలు టిఆర్ఎస్ బిజెపితో జతకడుతుందని ప్రచారంతో ముస్లింలు క్రైస్తవులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను బలపరచడమే ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు.

ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం పై కూడా ఇటు ఉద్యోగుల్లోనూ అటు నిరుద్యోగుల్లోను వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ప్రతిరోజు లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్లు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమకు అంతో ఇంతో ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఫోటోలు తీసి పెనాల్టీ రూపంలో నెలలో ఒక్కసారైనా నాలుగు నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారని అలా అయితే తమ మనుగడ కష్టంగా మారిందని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు.

వీరు ఆటోలో ఎక్కిన ప్రయాణికులు రాజకీయంగా చర్చ పెట్టినప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడటం ప్రతి పక్ష పార్టీలకు ఆయాచితంగా కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు అసంతృప్తి తీవ్రస్థాయిలోనే ఉంది,. నిర్మాణరంగంలో ఉన్నటువంటి అన్ని రకాల వృత్తిదారుల్లోనూ ఇసుక విషయంలో ఆంధ్రాలో కొంత ఇబ్బందికర పరిస్థితులతో ఆ రంగం కుంటుపడిందనే విమర్శ ఉంది. దాంతో ఆ రంగంలో పనిచేసే లక్షలాదిమంది వృత్తిదారులను అసంతృప్తి నెలకొని ఉంది.

లోటు బడ్జెట్ తో నడిచే కొత్త రాష్ట్రంలో అంత పెద్ద స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కూడా గొప్ప విషయమే కావచ్చు కానీ ప్రజలు అచ్చంగా సంక్షేమం పథకాలను చూసి జగన్మోహన్రెడ్డిని తిరిగి అధికారంలోకి తెస్తారా అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది. జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రధానమైన రంగాలను , వ్యవస్థలను గుర్తించి , సకాలంలో వారిని సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకుంటే వైసీపీ వైసీపీకి మేలు జరుగుతుందని , లేకపోతే కచ్చితంగా ఆ ప్రభావం వైసిపి గెలుపు పై చూపిస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment