తెలంగాణ ప్రత్యేక కథనాలు

కబ్జా దార్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న కలెక్టర్… తాజాగా రూ. 4. 35 కోట్ల విలువైన స్థలాలు స్వాధీనం చేసుకున్న అధికారులు..

Written by Mohiddin Shaik

కలెక్టర్ కబ్జాలపై కన్నెర్ర చేయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి… ఖమ్మం నగరంలో జీవో నెంబర్ 58 59 కింద కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది అక్రమార్కులు అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు… .రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఖమ్మం నగరంలో ఆయా జీవో కింద రిజిస్ట్రేషన్ లైన అక్రమ క్రమబద్దీకరణలను జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ విచారణ జరిపి రద్దు చేస్తున్నారు…

విచారణల పర్వం వేగంగా కొనసాగుతోంది.. తాజాగా 4.35 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు…
..

ఖమ్మం అర్బన్ పరిధిలో ఖానాపురం సర్వే నెం. 272 లో 300 గజాల ప్లాట్, ఖానాపురం డొంకలో 200 గజాల రెండు ప్లాట్లు, 150 గజాల ఒక ప్లాట్, వెలుగుమట్ల సర్వే నెం. 412లో 300 గజాల ప్లాట్ స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా పలువురు జీవో 59 క్రింద దరఖాస్తు చేశారన్నారు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు.

సుమారు రూ. 4.35 కోట్ల విలువైన పై స్థలాలను రెవెన్యూ, మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, మునిసిపల్ సిబ్బంది నిఘా పెట్టి, ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, నిర్మాణాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment