తెలంగాణ ప్రత్యేక కథనాలు

దరఖాస్తు ఒక్కటే …గ్యారంటీలు ఆరు…… ఈరోజు సాయంత్రం నుంచి అందుబాటులోకి దరఖాస్తులు..తీపి కబురు చెప్పిన ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతం…

Written by Mohiddin Shaik

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు బుధవారం ఈరోజు సాయంత్రం నుంచి లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రకటించారు…

6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలన్నింటికీ లబ్ధిదారుడు ఒకే దరఖాస్తు ఫారంలో నింపి ఇవ్వచ్చు… అర్హతను బట్టి ఆ ఒక్క దరఖాస్తు తీసుకుని సంక్షేమ పథకాలన్నిటిని ప్రభుత్వం అమలు చేయబోతోంది..దరఖాస్తు తీసుకున్న తర్వాత అధికారులు లబ్ధిదారులకు రసీదు ఇచ్చి మరి అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తారని మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రితో సహా ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ప్రకటించారు..

దానికి అనుగుణంగానే బుధవారం దరఖాస్తులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని సాయంత్రం నుంచి దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని ప్రకటన చేశారు.. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు పొందటానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఈరోజు నుంచే దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయనే ప్రకటన సంతోషాన్ని కలిగిస్తోంది…

మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ఒకే ఫారం లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన అన్నారు. గురువారం నుండి ప్రారంభం అయ్యే ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

గ్రామ/వార్డు సభలు ఉ. 8.00 గంటల నుండి మ. 12.00 గంటలు, తిరిగి మ. 12.00 గంటల నుండి సా. 6.00 గంటల వరకు జనవరి 6 వరకు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. గ్రామ/వార్డు సభల నిర్వహణ విషయమై ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇస్తామని, దరఖాస్తులు పూరించి, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో గ్రామ/వార్డు సభలలో సమర్పణకు ప్రజలు సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment