జాతీయం తెలంగాణ ప్రత్యేక కథనాలు

బస్సు సర్వీసులు పెంచకుంటే కష్టాలు తప్పవా…ఇప్పుడే ఎట్లుంటే పెళ్లిళ్లు పండుగలు సీజన్ గడిచేది ఎలా..!ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందే..

Written by Mohiddin Shaik

జగిత్యాలలో లాస్ట్ బస్సు వెళ్లిపోవడంతో ఒక విద్యార్థిని ఎక్కి ఎక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది…
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తమ పాలిట శాపంగా మారిందంటూ ఆమె బెగ్గర్గా ఏడుస్తూ చెబుతోంది…

ఇప్పుడు మా ఊరికి నేను ఎలా వెళ్లాలి , నాకు కొత్త బస్సు వేయాల్సిందే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ , ఆమె తన ఆవేదనను వెళ్లగెక్కిన వీడియో అనేకమందిని ఆలోచింపచేస్తోంది…
బస్సు సర్వీసులు పెంచకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంటే , పండగలు, పెళ్లిళ్ల సీజను గడిచేదేలా… ఇదే సర్వీసులు నడిపిస్తే, ఆయా బస్సుల్లో ప్రయాణం నరకంగా మారడం ఖాయం.. కొందరు ఎక్కగలిగితే , మరికొందరుకొందరు బస్సు దొరక్క నానా ఇబ్బందులు పడక తప్పదేమో…

ఇప్పటికే మహిళ లు పెద్ద సంఖ్యలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.. ఏ బస్సు చూసిన కిటకిటలాడిపోతోంది..కాలు పెట్టే సందు లేక, వృద్ధులు, చంటి పిల్లలతో ఉన్న మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు..

…. ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి…

బస్సు సర్వీసులు పెంచే అంశంపై ఆర్టీసీ చైర్మన్ లేదా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికుల నుండి డిమాండ్ వస్తోంది.. ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల తమ ఆదాయం పడిపోయిందంటూ ఆటో కార్మికులు ఒకపక్క ఆందోళనలు చేస్తుండగా మరోపక్క ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యంతో మహిళా ప్రయాణికుల శాతం గణనీయంగా తిరిగి ప్రతి బస్సు సందు లేకుండా పూర్తిస్థాయిలో స్టాండింగ్ తోనే నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..

పెళ్లిళ్ల సీజన్ మొదలైతే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అప్పుడు సర్వీసులు పెంచాలని ప్రభుత్వం ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న బస్సు సర్వీసులు సరిపోవటం లేదనేది గుర్తించాల్సిన అవసరం ఉంది జగిత్యాలలో విద్యార్థిని ఆవేదనతో ఈ అంశాన్ని వెంటనే తేల్చాల్సిన అంశంగా గుర్తించాలని పలువురు కోరుతున్నారు..

About the author

Mohiddin Shaik

Leave a Comment