జాతీయం తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

ఆధార్ ఉంటే చాలు ఇక ఆర్టీసీ లో ప్రయాణం ఫ్రీ…తెలంగాణ మహిళలకు సోనియా తన పుట్టినరోజు కానుక.. ఆరోగ్య శ్రీ సేవలు 10 లక్షల స్థాయికి పెంపు..

Written by Mohiddin Shaik

తెలంగాణ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చట.. ఇది ఎప్పటికి జరుగుతుందో అనుకుంటున్నారా… ఎప్పుడూ కాదు ఈనెల తొమ్మిది , అంటే ఈ శనివారం నుంచి ఫ్రీ పథకం అమల్లోకి వస్తుందట. ఈనెల తొమ్మిదవ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు.. ఆమెకు పుట్టినరోజు కానుకగా, తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికారాన్ని ఇస్తే, , ఆమె తెలంగాణ మహిళలకు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే కానుకను ఇవ్వనున్నారు..

వినటానికి ఇవి జరిగే పనేనా , అని చాలామంది అనుకుంటున్నారు …కానీ అక్షరాలా జరిగి తీరుతుందని , కావాలంటే ఈ నెల తొమ్మిదవ తేదీన మీరంతా హైదరాబాదు రండి…ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వెళ్లండి .. అంటూ మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ చెప్పేశారు. ఇక ఆధార్ కార్డుతో బయలుదేరి, ఆర్టీసీ బస్సులో మన మహిళా మణులు ఫ్రీగా ప్రయాణం చేయడమే తరువాయి.. సోనీ అమ్మ ఇచ్చిన 6 గ్యారంటీల్లో , ముందుగా ఈ గ్యారెంటీని ఈనెల తొమ్మిది నుంచే అమల్లోకి తెస్తున్నారట..

…. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు పది లక్షల స్థాయికి పెంపు…

ఇక రెండవ గ్యారంటీ కింద ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలు పొందుతున్న వైద్యం సహాయాన్ని పది లక్షల వరకు ఉచితంగా ఖర్చు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. పది లక్షల ఖర్చు అయ్యే స్థాయి వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందించడం కూడా రెండవ గారంటీగా ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి తీస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ప్రగతి భవన్ ఇనుప గేట్లను, ముళ్ళకంచెలను, తొలగించటంతో మొదలైన, కాంగ్రెస్ పాలన ఇంకా ఎన్నెన్ని మార్పులు తేనుందో, ఏ విధమైన పాలన అందించనుందో, వేచి చూడాలి.

About the author

Mohiddin Shaik

Leave a Comment