జాతీయం తెలంగాణ ప్రత్యేక కథనాలు రాజకీయం

ముగ్గురు మొనగాళ్లు… జిల్లా రాజకీయ చరిత్రను సృష్టించిన నేతలు…ఊహించినట్లే జిల్లాకు మూడు మంత్రి పదవులు ..

Written by Mohiddin Shaik

ఖమ్మం జిల్లాకు పదవుల పంట పండింది.. జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం అయింది… గురువారం తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ నూతన ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి

అందరూ ఊహించిన విధంగానే మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించి రెవెన్యూ శాఖను కేటాయించారు. అదేవిధంగా జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరు వీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని భీషణ ప్రతిజ్ఞ చేసి, సంచలనం సృష్టించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.

ఇక మాజీ సీనియర్ మంత్రి ఖమ్మం జిల్లా రాజకీయాలను సుదీర్ఘ కాలం పాటు తన కనుసన్నల్లో నడిపిన నాయకుడు తన రాజకీయ జీవితంలో సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవి పదవులు నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు నేతలకు కేటాయించిన పోర్టు పోల్యులు కూడా ప్రాధాన్యం కలిగినవే కావడం విశేషంగా చెప్పవచ్చు.

గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఎల్బీ స్టేడియంలో కన్నుల పండుగగా జరిగింది. ఆయన మంత్రివర్గంలో ఓకే జిల్లాకు మూడు మంత్రి పదవులు లభించడం పట్ల ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

…. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రిగా చెప్పవచ్చు.తుమ్మల నాగేశ్వరరావు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కరలేని పేరు. హుందాగా ఉండే అచ్చమైన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. ఆయన 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1959 నవంబర్ 15న జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు స్వర్గీయ ఎన్ టి రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు .అదేవిధంగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ మంత్రివర్గంలోనూ రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.

14 సంవత్సరాలకు పైగా ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన ఇదివరకు సత్తుపల్లి నుంచి శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు 2009లో ఖమ్మం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ తరువాత టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అయ్యారు.మళ్ళీ ఇప్పుడు తాజాగా ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

…అంచలంచలుగా ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగిన విక్రమార్క..

ఇక మల్లు భట్టి విక్రమార్క మల్లు అనంత అనంత రాములు సోదరుడిగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్గా, పిసిసి సభ్యుడిగా , ఆ తరువాత అంచలంచలుగా ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగిన విక్రమార్క.2007 స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కమ్యూనిస్టులు కోటగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలో విజయం సాధించి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనసు గెలుచుకున్నారు..బట్టి విక్రమార్క 2009 నుంచి 2023 వరకు మధిర నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు.

1961లో జూన్ 15న వైరా మండలం స్నానా లక్ష్మీపురంలో మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు జన్మించిన విక్రమార్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదివారు . ఆయన ఎమ్మెల్సీ గా గెలిచిన రోజుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉండేవి .

అప్పటి సమకాలిన రాజకీయ పరిస్థితుల్లో , అటు తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, ఇటు సిపిఎం పార్టీలో తమ్మినేని వీరభద్రం, సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు వంటి రాజకీయ వ్యూహకర్తలు , హేమాహేమీల మధ్య చాకచక్యంగా రాజకీయాలు నడుపుతూ, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. వ్యూహాత్మక అడుగులతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని మెప్పించి,2011 ప్రభుత్వ చీఫ్ విప్పు పదవిని పొంది , ఆ బాధ్యతలు నిర్వహించారు.

2011 నుంచి 2014 వరకు కొంతకాలం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది. ఆ తరువాత 2019 నుంచి 2023 వరకు సీఎల్పీ నాయకుడిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్రను బట్టి విక్రమార్క పోషించి ఉన్నారు . ఇప్పుడు ఆయనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదా తో రెవెన్యూ శాఖ మంత్రిగా అవకాశం లభించింది. ఖమ్మం జిల్లా చరిత్రలో జలగం వెంకటరావు ముఖ్యమంత్రి కాగా మళ్లీ ఇప్పుడు బట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రిగా అవకాశం లభించటం విశేషం.

…. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగులేటి…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన 2013లో వైఎస్ఆర్సిపి లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు 2014లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 2016లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు 2023 లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో తనకు టిఆర్ఎస్ ఎంపీ సీటు కేటాయించకపోవడంతో ఆ తర్వాత ఆ పార్టీతో పెరిగిన అంతరం వల్ల ఆయన కాంగ్రెస్ లో చేరి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపును తెచ్చారు అనడంలో సందేహం లేదు. డిగ్రీ వరకు చదువుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మీద ముగ్గురు మొనగాళ్లు ఖమ్మం జిల్లాకి మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment