తుఫాను మాదిరిగా వీచిన కాంగ్రెస్ గాలిలో ఎవరు కొట్టుకుపోతారో, ఆ గాలికి ఎదురొడ్డి ఎవరు నిలబడతారు ..ఆదివారం తేలిపోనుంది.. గత ఎన్నికలకు భిన్నంగా 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల సరళి కనిపించింది. విచిత్రంగా కనిపించిన ఆ ఎన్నికల సరళి కారు పార్టీని తీవ్ర కలవరానికి గురిచేస్తుంది..కాంగ్రెస్ పట్ల వీచిన గాలి కాంగ్రెస్ నేతల గొప్పతనం రాలేదని, ఆ పార్టీ మీద అభిమానం వలన వచ్చినట్లు కూడా కాదని, అధికార బి ఆర్ ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల ఏర్పడిందని కొందరు విశ్లేషిస్తున్నారు ..

ఇది ఇలా ఉంటే ఆ గాలి ఓటర్ల నుంచి పుట్టి , ఓటర్ల ద్వారానే వ్యాప్తి చెందినందున ఓట్లు వేసే సమయంలో , ఓటర్లు పెద్దగా డబ్బుకు, ఇతర ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే అభిప్రాయాలు పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఈ అంశమే కారు పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఒకవేళ ఓడిపోయినప్పటికీ, అది పూర్తిగా అభ్యర్థుల పై ఓటర్లకు ఉన్న వ్యతిరేకత వల్ల అని, చెప్పలేమని అది పూర్తిగా విఆర్ఎస్ పార్టీపై వచ్చిన వ్యతిరేకత వల్లనే ఓటమి జరిగి ఉంటుందని అభిప్రాయాలు కూడా విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నాయి. అన్ని వర్గాల ఓటర్ల నుంచి సైలెంట్ గా సాగిన ఓటింగ్ సరళి ని బట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వే సంస్థలన్నీ కూడా అంచనా వేశాయి…

…. ప్రచారంలో కనిపించిన సరికొత్త అంశాలు…
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ప్రచారం కోసం ప్రజలను రోజుకు ఎంతో కొంత ఇచ్చి పిలుచుకునే పరిస్థితులు కొనసాగాయి..
కానీ ఈ ఎన్నికల్లో కొంతమంది విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం సంబంధం లేని వాళ్ళు. స్వచ్ఛందంగా కొన్ని గ్రామాల్లో విస్తృతంగా తిరిగి బి ఆర్ఎస్ ను ఓడించాలని, కాంగ్రెస్ను గెలిపించాలంటూ ప్రచారం చేసినట్లు కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. అదే విధంగా కొంతమంది రిటైర్ అయిన డాక్టర్లు ,స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో తిరిగి బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రచారం చేసినట్లు చెబుతున్నారు. ఇటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో జరగడం కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. అయితే సర్వేలు చెప్పినట్టు నూటికి నూరు శాతం జరుగుతుందా ,అనేది కచ్చితంగా చెప్పలేం,.
కానీ దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, కొనసాగిన ఎన్నికల సరళీ మాత్రం కారు పార్టీకి ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేశారని భావన కలిగించే విధంగానే సాగిందనే విషయాన్ని సర్వే సంస్థలన్నీ వ్యక్తపరిచాయి. ఆదివారం మధ్యాహ్నానికి గెలుపు ఓటములకు సంబంధించి ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పనున్నారు.
మొత్తం మీద గెలుపు కోసం భారీగా డబ్బు ఖర్చు చేసిన అధికార పార్టీ అభ్యర్థులు కూడా ,ఆందోళన చెందక తప్పని పరిస్థితులు ఈ ఎన్నికల్లో వచ్చాయని కొందరు అంటున్నారు. అధికార పార్టీ కొన్ని లోపాలను కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాట నిజమే, కానీ, అభివృద్ధికి సంబంధించి , సంక్షేమానికి సంబంధించిన అనేక పథకాలు బి ఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసిన మాట కూడా కాదన లేనిది అని కొందరు అంటున్నారు. అంతిమంగా ప్రజలు ఏ విధమైన తీర్పును ఇస్తారో ఆదివారం తేలిపోనుంది.
