కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్క సంవత్సరంలోనే తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్రమంత్రి జయరాం రమేష్ చెప్పారు.శుక్రవారం ఖమ్మం వచ్చిన సందర్భంగా మరో ఏఐసిసి నాయకులు జెడి సేలంతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చివరకు ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేసినప్పటికీ ఆ నోటిఫికేషన్లో అనేక లోపాలతో రద్దు కావడంతో , ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడి చదివిన అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారని పేర్కొన్నారు.అందుకే నిరుద్యో గీత లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికల పోస్టర్పై ముఖ్యమంత్రి బొమ్మ పక్కన 9 ఏళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు రాసి ఉంది అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు.
రైతులు ,కవులు రైతులు , వ్యవసాయ కూలీలకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15000. రైతుకు, వ కవులు రైతుకు ఎకరానికి 12 వేల రూపాయలతో పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు .బిజెపి కి బి ఆర్ ఎస్ బిటీం గా పని చేస్తోందని అదేవిధంగా ఎంఐఎం సీ టీమ్ గా పనిచేస్తుందని అన్నారు . కాంగ్రెస్కు వేసే ఒక్క ఓటుతో ఆ మూడు పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
పాత అంబాసిడర్ కారును పక్కకు నెట్టేయండి.
టిఆర్ఎస్ గుర్తైనా పాత అంబాసిడర్ కారును పక్కకు తోసేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
