ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాధపాలెం మండలం మల్లేపల్లి గ్రామ సర్పంచ్ బండి వెంకన్న తేజ వీరన్న అరవై పల్లి రేణుక భూక్య గోరియ ఇతర మరో వంద కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారిలో నండ్ర గోపయ్య, రమేష్ , వెంకన్న , సతీష్, వీరేష్ , లక్ష్మయ్య , వెంకటేశ్వర్లు , తదితరులు ఉన్నారు.
వీరంతా ఆదివారం ఖమ్మం లోని మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు సామాన్యులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు కచ్చితంగా నిలబెట్టుకుంటుందని ఆయన తెలిపారు కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలంగాణలో కూడా సోనియాగాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు అవుతాయని ఆయన అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ బానోతు అశోక్ ధారావత్ రామ్మూర్తి నాయక్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
