ఆడబిడ్డలకు పెద్ద పార్టీల అభ్యర్థులు ఖరీదైన కానుకలు ఇస్తారట…? చెవి కమ్మలు ముక్కు పుడకలు ఇచ్చి అమ్మ నీ ఓటు మా గుర్తుకే వేయమని అడుగుతారట…నిఘా.విభాగాలు మాత్రం డేగ కన్నుచూస్తున్నాయి..పట్టుకొని కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి..
అమ్మో అంత ఖరీదైన కానుకలు నిజంగా ఇస్తారా అనుకుంటున్నారు కదూ… నిజమే నట ఆ ర ఆ రకంగా ఇవ్వబోతున్నారని ఎన్నికల నిఘా అధికారులకు సమాచారం వచ్చిందట… ఈ విషయం శనివారం మీడియా సమావేశంలో అధికారులే స్వయంగా చెప్పారు…అవి టోకుగా ఎవరైనా కొంటే తమకు ఆది సమాచారం ఇవ్వాలని అధికారులు బంగారు వ్యాపారులకు సూచన చేశారు..
.జువెల్లరి షాప్ యజమానులు తమ వద్ద బల్క్ గా కొనుగోళ్ళు జరిగితే,
తమకు తెలియజేయాలన్నారు.అధికారులు ఆదేశించారు..

మావి డబ్బు రాజకీయాలు కాదు అంటున్నారనేగా మీ అనుమానం.. అవన్నీ ఒట్టిమాటలేనట.. నిఘా వర్గాలకు చిక్కకుండా గుట్టుగా కానుకలు తెచ్చి ఆడబిడ్డలకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి అంటున్నారు..
ఇప్పటికే చెక్ పోస్టుల వద్ద పోలీసులు అనేక వస్తువులు డబ్బు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు.. ఎంపీ వాహనంలో హెట్రో డ్రగ్స్ లక్ష టీ షర్ట్లు పట్టుకొని కేసు పెట్టారు.. 7000 గోడ గడియారాలు పట్టుకున్నారు చీరలు ఇలా అనేక వస్తువులు ఇప్పటికే పట్టుకొని సీజ్ చేశారు.. అంటే ముందస్తుగానే కానుకలు అన్నీ చేరాల్సిన ప్రదేశాలకు పాపం అభ్యర్థులు నాన్న తండాలు పడి చేర్చుతున్నారన్నమాట…
షర్ట్ లు గడియారాలు ఇవన్నీ చిన్న కానుకలే… కానీ బంగారు చివికములు ముక్కుపుడకలు అవి చూడటానికి చిన్నవైనా ఖరీదు ఎక్కువే ఉంటుంది… నిఘా వర్గాల కంటపడకుండా ఉంటే కానుకలు అందటం ఖాయమేనట.. మరి ఓట్ల పండుగ వేళ కానుకలు వస్తాయో రావు వేచి చూద్దాం….
