ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 147 నామినేషన్లు , తొలగింపులు ఫోను మిగలగా వాటి నుంచి 17 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు . కాగా 130 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బి ఆర్ ఎస్ పార్టీ తరఫున తాజా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థిగా మాజీ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తలపడుతున్నారు.
సిపిఎం పార్టీ నుంచి ఎర్ర శ్రీ కాంత్ రంగంలో ఉండగా, బీఎస్పీ నుంచి హైతగాని శ్రీనివాస గౌడ్ రంగంలో ఉన్నారు ఇంకా బిజెపి అభ్యర్థితో పాటు. జనసేన అభ్యర్థిగా మిరియాల రామకృష్ణ బరిలో ఉన్నారు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 36 మంది ఖమ్మం నుంచి రంగంలో ఉన్నారు
పాలేరు అసెంబ్లీ నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి రంగంలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలపడుతున్నారు. కాగా ఈ నియోజకవర్గ నుంచి సిపిఎం అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు ,ఎంపీ ,తమ్మినేని వీరభద్రం రంగంలో ఉన్నారు. వీరు గాక బిజెపితో , , బి ఎస్ పి అల్లిక వెంకటేశ్వర్లు ,స్వతంత్ర అభ్యర్థుల తో కలిపి 39 మంది పోటీ లో ఉన్నారు.పాలేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మాధవి రెడ్డి రంగంలో ఉన్నారు.
మధిర కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలో ఉండగా, బి ఆర్ ఎస్ పార్టీ నుంచి లింగాల కమల్ రాజు రంగంలో ఉన్నారు. సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్, బిజెపి విజయరాజు రంగంలో ఉండగా వీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి రంగంలో ఉన్నారు మొత్తం 20 మంది పోటీ, లో ఉన్నారు
సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్, బిజెపి విజయరాజు రంగంలో ఉండగా వీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి రంగంలో ఉన్నారు మొత్తం 20 మంది పోటీ, లో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వీఆర్ఎస్ అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ రంగంలో ఉండగా సిపిఎం నుంచి మాచర్ల భారతి రంగంలో ఉన్నారు. బిజెపి రామలింగేశ్వరరావు బిఎస్పి వెంకటేశ్వరరావు తో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 23 మంది రంగంలో ఉన్నారు.
వైరా నియోజకవర్గంలో నుంచి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా బానోతు మదన్లాల్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి మాలోతు రాందాస్ నాయక్ రంగంలో ఉన్నారు . కాగా సిపిఎం నుంచి వీరభద్రం బరిలో ఉండగా, జనసేన నుంచి సంపత్ నాయక్ బిఎస్పీ నుంచి రాంబాబు రంగంలో ఉన్నారు ఇక్కడ మొత్తం 12 మంది బరిలో నిలిచారు.
