ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు…ఓట్ల కోసం వేట యుద్ధం మాదిరిగా సాగుతోంది .. వాకిలి ఊర్చకముందే అభ్యర్థులు వస్తున్నారు.. అమ్మలారా అయ్యలారా మీ ఓటు కారు గుర్తుకే,..అక్కలారా, తమ్ములారా మీ ఓటు హస్తం గుర్తుకే ,… సోదరులారా మీ ఓటు కంకి కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తులకే వేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు… బిజెపి తో సహా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓట్ల వేటలో బిజీగానే ఉన్నారు… ఓట్ల పండగ సందర్భంలో ఇవన్నీ షరా మామూలే….
…. ఓట్లు అడిగే వారిలో సొంత పార్టీ వారు ఎంతమంది…!

ప్రచార శైలిలో గతానికి ఇప్పటికీ ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒక 20 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు ఏ పార్టీ తరఫున పాల్గొంటారో,,నూరు శాతం వారంతా ఆ పార్టీ సొంత కార్యకర్తలు …ఎటువంటి త్యాగానికైనా వెనకాడని అచ్చమైన కార్యకర్తలు..
ఉదాహరణకు కమ్యూనిస్టు పార్టీ జెండాలు పట్టుకొని తమ పార్టీకి ఓటు వేయండి అంటూ అడిగే కార్యకర్తలు, అచ్చంగా ఆ పార్టీ కార్యకర్తలే ఉండేవారు.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అంటూ మూడు రంగుల జెండాతో వచ్చే కార్యకర్తలు ఆ పార్టీ కోసం ఏ త్యాగానికైనా వెనకాడని అచ్చమైన కార్యకర్తలు ఉండేవారు.. అప్పట్లో ప్రధాన పార్టీలు ఒక పార్టీతో ఇంకొక పార్టీకి రాజకీయంగా వైరుధ్యం బలంగా ఉండేది.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ పక్షాన ఏ కార్యకర్తలు పాల్గొంటున్నారు ఖచ్చితంగా చెప్పడం కష్టంగా మారింది.
ఎందుకంటే ఈరోజు గులాబీ టోపీ తో జండా పట్టుకొని ఓట్లు అడిగిన వారిలో, అనేకమంది రేపు మూడు రంగుల జెండా పట్టుకుని , ఆ పార్టీ టోపీ పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు .. అంటే ప్రచారానికి వచ్చే వారంతా ఆ పార్టీ సొంత కార్యకర్తలు కాదని కచ్చితంగా చెప్పవచ్చు.. పని కోసం వచ్చిన విధంగా అనేకమంది ఏ పార్టీ వారు పిలిస్తే ఆ పార్టీ ప్రచారానికి వెళుతున్నారు..
పని పూర్తి కాగానే ఆ జెండాలు టోపీలు ఆ పార్టీ వారికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు.. మళ్లీ తెల్లారి వేరే పార్టీ వారు పిలిస్తే ఆ పార్టీ టోపీలు ఆ పార్టీ జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తున్నారు.. దీనివల్ల తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్న ఇటువంటివారు వారి ఓటు తనకు వేస్తారా , వేయరా, ఆ పార్టీ అభ్యర్థికి కూడా తెలియదు.. ఈ ధోరణి ప్రధాన పార్టీల ప్రచారంలోనే కనిపిస్తుంది.
.ఎన్నికల ప్రచార శైలిలో వచ్చిన ఈ మార్పు పొత్తుల రాజకీయాలకు నిదర్శనం కావచ్చు. ఈ విధమైన మార్పు పట్టణం నుంచి పల్లె వరకు అంతట స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ప్రజల్లో వచ్చిన ఈ మార్పు చైతన్యమొ.. లేక మరి ఏమిటో, రాజకీయ మేధావులకే తెలియాలి..
