తెలంగాణ రాజకీయం

డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు కాంగ్రెస్ లో చేరిక…కాంగ్రెస్లో చేరుతున్నవారిని ప్రజలు అభినందిస్తున్నారు.. తుమ్మల…

Written by Mohiddin Shaik

ఖమ్మం కార్పొరేషన్ బీ.అర్.ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ప్రస్తుత ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
బీ.అర్.ఎస్.. బీ. జే.పి ఒక్కటే అని నమ్ముతున్న మైనార్టీలు
ఖమ్మం అరాచక పాలనకు విసుగు చెంది పార్టీని వీడుతున్నారని అన్నారు .కాంగ్రెస్లో చేరుతున్న కార్పొరేటర్ లను వారి మిత్రులు స్నేహితులు ప్రజలు ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు. తన హయాంలో కార్పొరేటర్లు ,మేయర్ ల పనిలో జోక్యం చేసుకోలేదు అని తుమ్మల పేర్కొన్నారు.

వారికీ గౌరవ మర్యాదలు కల్పించాం అని చెప్పారు. ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో చేరిన వీఆర్ఎస్ కార్పొరేటర్ నాగుల్ మీరా మాట్లాడుతూ
మంత్రి అజయ్ ఫోన్ లో బెదిరించి బండబూతులు తిట్టారని ఆరోపించారు.నాకేమైనా జరిగితే అజయ్ భాద్యత వహించాలన్న మీరా అన్నారు.ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు మారుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు .

ఈసందర్భంగా మాజీమంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం లో అరాచకపాలన సాగుతుందని బెదిరింపులు …అక్రమకేసులు ,నిత్యకృత్యమైయ్యాయని ఆరోపించారు . బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ పై విమర్శలు గుప్పించారు …

About the author

Mohiddin Shaik

Leave a Comment