ఎన్నికల తుది ఘట్టానికి ఇక మిగిలింది 14 రోజులే… ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బి ఆర్ ఎస్ అధ్యక్షులు కెసిఆర్ పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు… పొంగులేటి చేరిక సందర్భంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. మళ్లీ ఇప్పుడు ఈనెల 21న సీఎం కేసీఆర్ మధిరలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు..
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈనెల 23న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు అందులో భాగంగా మధుర నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు… అగ్ర నేతల పర్యటనల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.. ఇదిలా ఉంటే ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది… ఓటర్లను కలుసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు శక్తి మేరకు కష్టపడుతున్నారు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు… గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల కంటే ఈసారి జరిగే ఎన్నికలపై గులాబీ దళపతి ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల సభలు నిర్వహిస్తుండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు…
. .. ఏ పార్టీ గాలి వీస్తోంది..?
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎక్కడ నలుగురు కూడిన రాజకీయ పార్టీల గెలుపు ఓటములు పైన చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని కొందరు అంటుంటే లేదు లేదు ఈసారి కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ మరికొందరు వాదిస్తున్నారు. నగరవాసుల్లో ఎక్కువమంది కాంగ్రెస్ వైపు మొగ్గుతారని కొందరు విశ్లేషిస్తున్నారు.
రూరల్ ప్రాంతంలో రైతులు గులాబీ పార్టీకే జై కొడతారని కొందరు బలంగా వాదిస్తున్నారు. రైతుబంధు రైతు భీమా పంటల కొనుగోలు 24 గంటలు విద్యుత్తు, ఇవ్వడంతో పాటు ఎరువులు విత్తనాలు కోసం ఇబ్బంది లేకుండా సకాలంలో అందుతున్నాయని అందుకే రైతులు కారు పార్టీకే ఓటు వేస్తారని కొంతమంది పరిశీలకులు అంటున్నారు.
కాగా వ్యవసాయ భూమిలేని పేదలు, కూలీలు, కవులు రైతులు, రైతు రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు రాణి పట్టణ ప్రాంత పేదలు, నిరుద్యోగులు, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, టిఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వారంతా హస్తం పార్టీ వైపు చూస్తున్నారని కొందరు పరిశీలకులు అంటున్నారు.ఈ వర్గాలన్నీ కలిసినప్పుడు వీరి సంఖ్య రైతుబంధు తీసుకుంటున్న రైతుల కంటే ఎక్కువే ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు.
ఇక సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలను పొందుతున్న వారు కూడా కారు పార్టీకే జై కొడతారని వాదన కూడా వినిపిస్తోంది. ఈ ప్రభుత్వ అనుకూల వ్యతిరేక అంశాలను విశ్లేషించిన కొందరు. ఫలితాలు ఏ పార్టీకి కూడా ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
