తెలంగాణ రాజకీయం

ఖమ్మం ఎన్నికల్లో హేమాహేమీలు..ఇక్కడి ప్రచారం ఓ ప్రత్యేకత..నిధులు బి ఆర్ ఎస్ ప్రభుత్వానివే ..కానీ అభివృద్ధి ఇద్దరూ చేసినట్లు చెబుతున్నారు….

Written by Mohiddin Shaik

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల యుద్ధంలో హేమాహేమీలు తలపడుతున్నారు… ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో ఒక తాజా మాజీమంత్రి ,మరొక మాజీ సీనియర్ మంత్రి, వేరువేరు పార్టీల నుంచి యుద్ధంలో దిగినప్పటికీ , అభివృద్ధి చేసింది మాత్రం నేనంటే , నేను అని ప్రచారం చేస్తున్నారు..

9 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ఈ తొమ్మిదేళ్లలో తమ పాలనలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం సహజం… కానీ ఖమ్మంలో విచిత్రం ఏమంటే కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడుతున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం నగరంలో చేసిన అభివృద్ధి అంతా తనదేనని నిధులు తెచ్చింది తానేనని ప్రచారం చేస్తున్నారు..

కారణం ఏమంటే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి మొన్నటి వరకు బి ఆర్ఎస్ లోనే ఉన్నారు.. పైగా ఈ జిల్లాకు మొట్టమొదటి బి ఆర్ఎస్ మంత్రిగా కూడా ఆయనే పనిచేశారు… అందుకే
ఖమ్మం అభివృద్ధికి నిధులు తెచ్చింది నేనే ,అభివృద్ధి చేసింది నేనే అని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ప్రచారం చేస్తున్నారు…

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వ్యక్తి గతంలో, బి ఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి నిధులు తెచ్చి ఉండవచ్చు .. అలా తెచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి విఆర్ఎస్ ప్రభుత్వాన్నియే అవుతాయి తప్ప ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లి ఆ గుర్తుపై పోటీ చేసే వ్యక్తి ఆ అభివృద్ధి కాంగ్రెస్ది అని ఎలా చెప్పుకుంటారు అని ప్రస్తుత తాజా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల రణరంగంలో నిలిచిన విరుద్ధమైన పార్టీల అభ్యర్థులు ఒకే అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ఒక్క ఖమ్మం నగరంలోనే జరగడం విశేషంగా చెప్పవచ్చు..

…. పాలేరు పోటీ ఓ ప్రత్యేకత…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారం జరుగుతోంది. తన గంభీరమైన పదజాలంతో ప్రసంగాల్లో ముఖ్యమంత్రిని సైతం టార్గెట్ చేసే వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అంతగా ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోలేని కందాల ఉపేందర్ రెడ్డి వీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అయితే కందాల ఉపేందర్ రెడ్డి ఉపన్యాసాలు చెప్పలేకపోవచ్చు కానీ ఆపదలో ఉన్న ప్రజలను ఓదార్చటంలో ముందు ఉంటారనే పేరు ఉంది.మరోపక్క ప్రజల్లోకి చేర్చుకొని పోయి అందరిని ఆకర్షించే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా పోరాటంలో నిలిచారు.ఇక్కడి నుంచే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఎం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. దీంతో పాలేరు ఎన్నిక రసవతంగా మారింది.

.. గట్టి బట్టి విక్రమార్క పోటీ ఓ ప్రత్యేకత…

కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయాల్లోనూ గట్టివాడుగా పేరున్న బట్టి విక్రమార్క మధిరలో తలపడుతున్నారు. ఒకపక్క ఆయన కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిగా రంగంలో ఉంటారనే ప్రచారం జరుగుతుండగా మరోపక్క సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయే మొట్టమొదటి స్థానం మధిర అంటూ వ్యాఖ్యలు చేశారు.. దీంతో మధురస్థానంలో జరిగే పోటీ రసవత్తరం గా మారింది టిఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ రంగంలో నిలిచిన లింగాల కమల్ రాజుకు బట్టికి మధ్య ప్రధాన పోటీ జరగనుంది. సిపిఎం వేరుగా పోటీలో ఉండడం వల్ల దాని ప్రభావం బట్టి గెలుపుపై ఉంటుందని సిపిఎం నేతలు చెబుతున్నారు.అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరినందున మరోపక్క సహజంగానే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తోందని తన గెలుపును ఎవరు ఆపలేరు అనే ధీమాను విక్రమార్క వ్యక్తం చేస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment