తెలంగాణ రాజకీయం

బి ఆర్ ఎస్ లో కి తాటి జంపు…హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న తాటి వెంకటేశ్వర్లు..మీడియాకు చెప్పిన ఎంపీ నామ..

Written by Mohiddin Shaik

మాజీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆయన మంగళవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో విఆర్ఎస్ లో చేరినట్లు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అశ్వరావుపేటలో మీడియాకు తెలిపారు.

…. కాంగ్రెస్ టిక్కట్టు జారేకు కేటాయించడంతో తాటి నిర్ణయం…

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తాటి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటే ముందే , ఆ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అశ్వరావుపేట కాంగ్రెస్ టిక్కెట్టు తనకు వస్తుందని తాటి ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం
జారే ఆదినారాయణ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన బి ఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.

దీంతో అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు కొందరు పేర్కొంటున్నారు. తాటి వెంకటేశ్వర్లు గతంలో బూర్గంపాడు శాసనసభ్యుడిగా పని చేశారు ఆయన చాలా కాలం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడుగా ఉన్నారు. కాగా ఇటీవల ఆయన బిఆర్ఎస్ లో ఉండగానే మాజీ మంత్రి తుమ్మలతో కూడా విభేదించి తుమ్మల నాగేశ్వరరావు పై పలు విమర్శలు బహిరంగంగా చేసి మరి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీలో తనకు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం దొరకదని తెలుసుకొని మళ్లీ కొద్ది రోజుల తేడాతోనే కాంగ్రెస్ కండువా తీసివేసి గులాబీ కండువా వేసుకున్నారు..

…. ప్రజల కోసమే పార్టీలు మారతారట…

ఎన్నికల ముందు ఇటు అటు సీటు దక్కకపోతే ఎటైనా సునాయాసంగా మారిపోతుంటారు కొందరు రాజకీయ నాయకులు.. ఎందుకు పార్టీ మారారు అంటే తమకు టిక్కెట్ రాలేదని పదవి దక్కలేదనో మారినట్టు అస్సలు చెప్పరు.. అచ్చంగా ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు చెబుతూ ఉంటారు.

అదే నిజమని బలంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు కానీ ప్రజలు కచ్చితంగా అంత వేగంగా పార్టీలు ఎందుకు మారుతున్నారు అర్థం చేసుకుంటారని విషయాన్ని నేతలు గమనించాల్సి ఉంది.. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు ఏ పార్టీలోనైనా చేరే స్వేచ్ఛ ఉంది ఏ పార్టీ కండువా వేసుకుంటే ఆ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకునే వాక్ స్వాతంత్రము ఉంది. అందుకే కొందరు ప్రజా నాయకులు ఏది చెప్పినా ప్రజలు వింటూ ఉంటారు అంతమాత్రాన వారు చెప్పిందంతా నిజమని వారు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారని చెప్పడం కష్టం.
మొత్తం మీద తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి మళ్లీ గులాబీ కండువా మెడలో వేసుకున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment