ఖమ్మం జిల్లాలో ఇంటి నెంబర్ లేకుండా దాదాపు 35 వేల అక్రమ ఓట్లు ఉన్నట్లు వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇదివరకే ఇదే అంశంపై తొమ్మిది సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని కూడా ఆయన తాజాగా చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
లోపాలను సరిచేసి తుది ఓటర్ల జాబితాను ప్రకటించ నున్న సందర్భంగా ఈ ఫిర్యాదును తుమ్మల కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. తుది జాబితాలో ఇంటి నెంబర్ లేకుండా నమోదై ఉన్న ఓట్లను తొలగించాలని కోరారు. ఇలాంటి ఓట్ల నమోదు జిల్లా కలెక్టర్ కమిషనర్ల కనుసర్లలోనే జరిగాయని స్థానిక మంత్రి తో వారు కుమ్మక్కై ఆ విధంగా చేశారంటూ కూడా ఆయన , ఆరోపించారు..
