తెలంగాణ ప్రత్యేక కథనాలు

జాదూగర్ కంటే గొప్ప మ్యాజిక్..ఇది ఒక పొలిటికల్ మ్యాజిక్

Written by Mohiddin Shaik

జాదూగారు చేసే మ్యాజిక్ షోలో కళ్ళు బైర్లు కమ్మే అద్భుతాలు కనిపిస్తాయి… ఒళ్ళు గగుర్పుడిచే భయానక దృశ్యాలు కనిపిస్తాయి… కళ్ళముందే వేదికపై ఒక మనిషి తలను మొండెం నుంచి వేరు చేసి చూపిస్తాడు మ్యుజీషియన్.. అందరూ చూస్తుండగానే ఒక మనిషిని ఒక పెట్టెలో పెట్టేసి తాళం వేస్తాడు… కొద్దిసేపటికి బయటికి రమ్మని పిలుస్తాడు అదే మనిషి పెట్టెలో నుంచి కాకుండా జనంలో నుంచి వచ్చి వేదిక ఎక్కి పరిచయం అవుతాడు..

ఇదో మహా అద్భుతంగా జనం అంతా ఆశ్చర్యపోతారు… ఆ మాత్రానికే జాదూగర్ గొప్పతనాన్ని పొగుడుతారు…. కానీ ఇప్పుడు జరిగే పొలిటికల్ మ్యాజిక్కులు చూస్తే ఆ జాదు గరు ఎందుకు పనికిరాడు అని అనక తప్పదు…

విషయం ఏంటో తెలుసుకుందాం రండి… ఉదయం 10 గంటలకు తాజా మాజీ మంత్రి అనేకమంది జనం, మీడియా ప్రతినిధుల మధ్య బహిరంగంగా ఒక వ్యక్తి మెడలో గులాబీ కండువా వేసి స్వాగతం పలికారు.. మరికొద్ది గంటలకే అదే వ్యక్తి ఆశ్చర్యంగా మాజీ మంత్రి వద్ద మూడు రంగుల కండువా మెడలో వేసుకుని కనిపించారు .

ఇద్దరు మంత్రుల్లో మ్యాజిక్ ఎవరు చేశారో తెలియదు కానీ మ్యాజిక్ మాత్రం అదిరింది అంటున్నారు చూసిన జనం ..


ఎన్నిక ల విచిత్రాల్లో ఇలాంటి సహజమేనని కొందరు అంటున్నారు….ఈ మ్యాజిక్ చిత్రాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి…

About the author

Mohiddin Shaik

Leave a Comment