తెలంగాణ రాజకీయం

పువ్వాడను ప్రశంసలతో ముంచెత్తిన ముఖ్యమంత్రి..మళ్లీ ఆ ఇద్దరినీ టార్గెట్ చేసిన కేసీఆర్…ఆ ఇద్దరి పీడ విరగడైందంటూ ఘాటు వ్యాఖ్యలు..కాంగ్రెస్ బిజెపిలకు తెలంగాణపై ప్రేమ లేదు..

Written by Mohiddin Shaik

కెసిఆర్ ప్రసంగం ఖమ్మంలో చలోక్తులు ఘాటు విమర్శలతో సాగింది… ఖమ్మం అభివృద్ధి పై మాట్లాడుతూ పువ్వాడ అజయ్ కుమార్ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.. ఇక ఆ తర్వాత పొంగులేటి , తుమ్మలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ ఇద్దరు పీడ విరగడయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు… ఇక్కడ మహా గొప్పోళ్ళు ఉన్నారు…ఒకాయన కు నేను మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే , ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చినట్లు చెబుతుండు.. ఇదే అజయ్ ఓడిపోయి మూలన కూర్చుంటే జిల్లాని సమన్వయం చేస్తాడని మంత్రి పదవి ఇస్తే ఆయన చేసింది గుండు సున్నా…

టిఆర్ఎస్ అభ్యర్థులను ఒక్క రిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని ఒకడు అంటాడు…ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాన్ని గుత్తకు తీసుకున్నాడా.. అట్లా అనొచ్చునా.. జనం ఊరుకుంటారా… ఖమ్మం పోరాటాల గుమ్మం . ఇక్కడ కమ్యూనిస్టులు చాలా చైతన్యం నేర్పారు… అలాంటి మాటలను ప్రజలు క్షమిస్తారా… నేను ఇదివరకే సత్తుపల్లి సభలో చెప్పిన.. ఇద్దరు కర్ణక ధమనులు ఉన్నారని వారి పీడ విరగడయింది… కర్ణక ధమనుల గురించి తెలియాలంటే చిన్నయ్య సూరి రాసిన పుస్తకం చదవాలి… ఉమ్మడి జిల్లాలో మంచి ఫలితాలు రాబోతున్నాయి.. పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు… తుమ్మలను, తుప్పలను తెచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి… అని నవ్వుతూ సెటైర్లు వేశారు.. ఇంతకుముందు పాలేరు ,సత్తుపల్లి, ఇల్లందు సభల్లో ఆ ఇద్దరు నాయకులు పై ఘాటు విమర్శలు చేసిన కేసిఆర్ తాజాగా ఆదివారం ఖమ్మం లో జరిగిన సభలో కూడా వారిద్దరిని టార్గెట్ చేస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు…

… అక్కడ ప్రభుత్వ విజన్ ఇక్కడ పువ్వాడ మిషన్ పనిచేయబట్టే అభివృద్ధి….

గొల్లపాడు ఛానల్ , ఆకారం లేని లకారం ట్యాంకుబండు సుందరీకరణ వరకు అభివృద్ధి వేగవంతంగా వందల కోట్లతో జరిగిందంటే దానికి కారణం అక్కడ ప్రభుత్వ విజన్ ఇక్కడ పువ్వాడ మిషన్ పనిచేయబట్టే సాధ్యపడిందని కేసీఆర్ స్పష్టం చేశారు

ఖమ్మం ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి పువ్వాడ అజయ్ కుమార్ కు ఓట్లు వేసి మరొకసారి గెలిపించాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎట్లున్న ఖమ్మం నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు అభివృద్ధి మీ కండ్ల ముందు ఉందని ఆయన అన్నారు. ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న సందర్భంలో వారికి హామీ ఇచ్చే విధంగా ఆయన ఉర్దూలో ప్రసంగాన్ని కొద్దిసేపు కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు పువ్వాడ అజయ్ కుమార్ ను ముద్దుగా అజయ్ ఖాన్ అని పిలుస్తారు అన్న సంగతి తనకు తెలుసునని అజయ్ ఖాన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ముస్లింల సంక్షేమం కోసం 900 కోట్లు కేటాయిస్తే తమ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో 12 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన ముస్లిం సోదరులకు తెలిపారు. ఇక బిజెపికి బి టీం అంటూ వస్తున్న ప్రచారాలను తిప్పుకొడుతూ కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం కుల మతాల వైరుధ్యాలు లేకుండా సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటదని ఆయన అన్నారు.

మున్నేరు తీగల వంతెన కోసం అజయ్ కుమార్ పట్టుబట్టి 700 కోట్లు మంజూరు చేయించారని కేసీఆర్ గుర్తు చేశారు. మున్నేరు కు రెండు వైపులా రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని ఒకప్పుడు మంచినీళ్ల కోసం పక్కనే పాలేరు ఉన్నప్పటికీ ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు 75 వేల మంచినీటి పంపు కనెక్షన్లు ఇవ్వడంతో నల్లా తిప్పితే నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు.

ఖమ్మంలో ఐటీ టవర్ ఎప్పుడైనా వస్తుందని ఎవరైనా కలగన్నారా అని ప్రశ్నించారు. అది పువ్వాడ అజయ్ కుమార్ వల్లే వచ్చిందని తనకు ఇక్కడ మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా పట్టుబట్టి మంజూరు చేయించారని ఆయన పేర్కొన్నారు. రఘునాథపాలెం ప్రాంతాన్ని 300 కోట్లతో అభివృద్ధి చేశారని ఆ ప్రాంతంలో ఇప్పుడు వెతికినా కూడా ఎక్కడ మట్టిరోడ్డు కనిపించడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

…. కాంగ్రెస్ బిజెపి వాళ్లకు తెలంగాణ పై ప్రేమ లేదు…

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీలు తెలంగాణ జెండా ముయ్యలేదని తెలంగాణ కోసం కొట్లాడలేదని కొట్లాడిన వాళ్లను సందర్భం దొరికినప్పుడు కొట్టి కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. అటువంటి పార్టీలకు తెలంగాణపై ప్రేమ ఉండదన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీచ్చు ఢిల్లీలో ఉంటదని అక్కడ స్విచ్ అయితే తప్ప ఎక్కడ లైటు వెలగదని కెసిఆర్ చలోక్తిగా పేర్కొన్నారు.

ఇక బిజెపికి బి టీం అంటూ వస్తున్న ప్రచారాలను తిప్పుకొడుతూ కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం కుల మతాల వైరుధ్యాలు లేకుండా సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటదని ఆయన అన్నారు.

ప్రాంతీయ పార్టీలు ఎక్కడకక్కడ బలంగా ఉండి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కీలక భూమిక పోషిస్తాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చినంక కరెంటు కష్టాలు పోయాయని ఆయన అన్నారు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ,లో వోల్టేజీ సమస్యలు లేని నాణ్యమైన కరెంటు పొందుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదని ఎంతో పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తే చేసే చిత్తశుద్ధి ఉంటే సాధ్యపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment