ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు తెలంగాణ రాజకీయం

చంద్రబాబు విడుదలతో ఖమ్మంలోనూ సంబరాలు…లకారం ఎన్టీఆర్ పార్కు లో పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్..బాబు విడుదలపై హర్షం ప్రకటించిన తుమ్మల…

Written by Mohiddin Shaik

కట్టలు తెంచుకున్న భావోద్వేగం కన్నీళ్లు పెట్టించింది…. చంద్రబాబును ప్రాణంగా ప్రేమించే హృదయాలు , ఆయన జైలు నుంచి బయటికి వచ్చిన వీడియోలు, ఫోటోలు , చూసి ఒకంత బరువెక్కాయి…. అంతలోనే తీరుకొని తాత్కాలికంగా నైనా తమ నేత బయటికి వచ్చినందుకు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు…. త్వరలోనే పులి లాంటి తమ నాయకుడు పూర్తిగా బయటికి వస్తాడు అంటూ మిఠాయిలు పంచుకున్నారు…

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి మంగళవారం మభ్యంతర బెయిలు పై విడుదల కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు… ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ పార్కు, లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడుతో తమ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు…
హైదరాబాదు నగరంలో సైతం తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది ఐటీ ఉద్యోగులు బాబు కొంతకాలం బయట ఉండే అవకాశం కోర్టు కల్పించడం పై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారు అనేకమంది ఇంతకాలం జైల్లో గడిపి బయటికి వచ్చిన బాబు వీడియోలను చూసి కొంతమంది భావోద్వేగానికి లోనయ్యారు.

కంటి క్యాటరాక్ట్ సర్జరీ కోసం చంద్రబాబు నాయుడుకు కోర్టు మధ్యంతర వేలు మంజూరు చేసింది. అయితే బాబుతో పాటు ఇద్దరు డిఎస్పి స్తాయి అధికారులు లు వెంట ఉండే విధంగా అవకాశం ఇవ్వాలని సిబిఐ కోరింది. వేలు పొందిన ఈ కాలంలో చంద్రబాబు నాయుడుకు కోర్టు కొన్ని షరతులను విధించింది. ప్రధానంగా మీడియాతో మాట్లాడకూడదని రాజకీయపరమైన ప్రసంగాలు చేయకూడదని షరతులు విధించింది

బాబు విడుదలపై హర్షం ప్రకటించిన తుమ్మల….

చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిలు పై విడుదల కావడం పట్ల మాజీ మంత్రి ప్రస్తుత ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నాయని ఖమ్మం నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో జరుగుతున్న సంబరాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని ఆ కార్యాలయం నుంచే ఆయన ప్రసంగించారు తాను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్టీ రామారావు గారి ఇచ్చిన అవకాశంతో పార్టీలో పని చేశానని చంద్రబాబు నాయుడు పెంపకంలో విలువలు ఉన్న మంచి నాయకుడిగా ఎదిగానని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

….. జైలు నుంచి రాగానే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు….

జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏకంగా ఆయన అక్రమ కేసులు పెట్టి నన్ను చంపుతారా అంటూ ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇంకా పలు హెచ్చరికలు కూడా , చేసినట్లు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కోర్టు షరతులను చంద్రబాబు నాయుడు ఉల్లంఘించారంటూ సిబిఐ కోర్టుకు ఫిర్యాదు చేయనున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తం మీద చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటికి రావడం పట్ల ఆయన అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment