పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇటీవల ఒక సంచలనంగా మారిందని చర్చ ఉంది… ఇక ఆయన పోటీ చేసే సీటు పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.. వాస్తవంగా పొంగు లేటి , కందాల ఉపేందర్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ… కానీ అసలు పోటీ పొంగులేటికి ,కెసిఆర్ కి మధ్య జరుగుతున్నట్లు అనిపిస్తోందంటున్నారు కొందరు…

పాలేరు సభలో కేసీఆర్ పొంగిలేటిపై తుమ్మల నాగేశ్వరరావు పై చేసిన ఆరోపణలు, ఘాటు విమర్శలతో ఈ నియోజకవర్గ పేరు రాష్ట్రస్థాయిలో మారుమోగుతోంది… ఇక ఆ తర్వాత కెసిఆర్ పై ఇటు పొంగులేటి ,అటు తుమ్మల చేసిన కౌంటర్ సవాళ్లు, ప్రతిజ్ఞలు , ఘాటు విమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి .. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి… అవి పాలేరు పై కేసీఆర్ కు మరింత పట్టుదలను పెంచేలా చేశాయని కొందరు అంటున్నారు…జనం ఎవరిని గెలిపిస్తారో తెలియదు గాని పాలేరు సీటుపై మాత్రం విస్తృత చర్చ జరుగుతుంది.
…. పొంగులేటి హాట్ కామెంట్స్ పై విస్తృత చర్చ…
పాలేరు లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పై కొన్ని విమర్శలు చేశారు. ఒక వ్యక్తి కొన్ని కాంట్రాక్టర్లు చేయడం ద్వారా వచ్చిన డబ్బు మదంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క, బిఆర్ఎస్ ఎమ్మెల్యే ని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని అన్నాడని పేర్కొన్నారు.. గేటు తాకనిచ్చేది అతను కాదని ప్రజలని ప్రజలు ఎవరిని పంపాలో ఎన్నికల్లో తేల్చుకుంటారని పేర్కొన్నారు..
ఆ వ్యాఖ్యలపై స్పందించిన పొంగులేటి మాట్లాడుతూ తన పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారని , కెసిఆర్ అదే పొంగులేటి పేరు ప్రస్తావించి ఉంటే ఆ వేదిక నుంచే జనం నుంచి వచ్చే స్పందనకు గుండె ఆగిపోయేదని వ్యాఖ్యానించారు… అంతటితో ఆగకుండా కెసిఆర్ నువ్వు నా పేరు చెప్పి ఉంటే నా తడాఖా ఏంటో చూపించే వాడిని అని కూడా అన్నారు. అప్పుడు కాదు ఇప్పుడు చెబుతున్న ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ని కూడా గేటు తాకనివ్వను అని మరోసారి తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు.. కందాల ఉపేందర్ రెడ్డి కాదు నా మీద పోటీ చేయడానికి నువ్వు పాలేరు రా ..అంటూ సవాల్ విసిరారు… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి ద్వారా కబ్జా చేసిన వందలాది ఎకరాల భూములు , అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల డబ్బు , తిరిగి తీసుకొని ప్రజలకు పంచుతామని పొంగులేటి ప్రకటించారు. పొంగులేటి చేసిన వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు , సవాళ్లు, ప్రతిజ్ఞలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికి, చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై కూడా కేసీఆర్ మాట్లాడుతూ గతంలో పువ్వాడ అజయ్ కుమార్ పై ఓడిపోయి ఇంట్లో మూలన కూర్చుంటే, పాత మిత్రుడని ఆయనను పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఖమ్మం జిల్లా పై ఏక ఛత్రాధిపత్యం అప్పచెపితే , పార్టీకి నష్టం చేశారని కెసిఆర్ ఘాటు విమర్శలు చేశారు.. దానికి స్పందించిన తుమ్మల పార్టీ అవసరాల కోసం తనను పిలిచి పదవి ఇస్తే తీసుకున్నానని , నేనేమీ పదవి కోసం పాకులాడలేదని కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా 1995లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించడంలో తన ప్రమేయం ఉంది తప్ప, తాను మంత్రి పదవి పొందటానికి పాకులాడలేదని తుమ్మల వ్యాఖ్యానించారు..
ఇలా పాలేరులో కేసీఆర్ సభ తర్వాత పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు స్థానిక అభ్యర్థి కందల ఉపేందర్ రెడ్డి పై గాక నేరుగా కెసిఆర్ పైనే జరుగుతున్నాయి . దీంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ,అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన దృష్టి సారించిన కందాల ఉపేందర్ రెడ్డి , మధ్య పోటీ, హోరా హోరీగా ఉంటుందని, ఆ నియోజకవర్గంలోని ఓటర్లకు కూడా ఓట్ల పండుగ సంబరాలు గొప్పగా ఉంటాయని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు..
