కామ్రేడ్లతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తుపై నీలి నీడలు అలుముకుంటున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. సిపిఐ సిపిఎం పార్టీలకు కాంగ్రెస్ ఇస్తానన్న సీట్లు ప్రకటించకుండా దోబూచులాడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు..
అంతటితో ఆగలేదు ఈనెల 31 లోగా తమకు కేటాయిస్తానన్న మిర్యాలగూడ, వైరా స్థానాలపై స్పష్టమైన ప్రకటన రావాలన్నారు .ఒకవేళ రాకపోతే తాము వేరుగా పోటీ చేయక తప్పదని ప్రకటించారు.. ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.. సిపిఐ కి కూడా కొత్తగూడెం, చెన్నూరు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.. కానీ అధికారికంగా స్పష్టత రాలేదు..
. … కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా…

కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలను అనుకున్న విధంగా సీట్లు కేటాయించి సంతృప్తిపరిస్తే ,పొత్తుల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంబనా తొలగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కావాలనే పొత్తుపై లైట్ తీసుకుంటుందా, అలా లైట్ తీసుకుని వదిలేస్తే , అది గులాబీ బాస్ కు వరంలా పనిచేస్తుందని కొందరు అంటున్నారు..
….. కారు పార్టీకి అయాచిత లాభం కలగనుందా..!
కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లో అలా వ్యవహరిస్తుందో తెలియదు గానీ , వామపక్ష పార్టీలతో పొత్తు పై ఆ పార్టీ అంత సీరియస్గా నిర్ణయం తీసుకోవడం లేదని అభిప్రాయం కామ్రేడ్స్ బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఒకవేళ వామపక్షాలు మరికొన్ని లౌకిక పార్టీలతో కలిసి , లేక ఆ పార్టీలే వేరుగా ఎన్నికల బరిలోకి దిగితే , అది కచ్చితంగా కెసిఆర్ పార్టీకి ఒక వరం అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే , వచ్చే ఎన్నికల్లో కారు జోరు అనేక స్థానాల్లో పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
వామపక్ష పార్టీలకు స్వతహాగా గెలిచే స్థాయిలో ఓట్లు లేకపోవచ్చు గాని , రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30 స్థానాలకు పైగా గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆయా పార్టీలకు ఓటు బ్యాంకు ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు
ఆ రెండు పార్టీలకు నాలుగు స్థానాలు కేటాయిస్తే, ఇంచుమించు 30 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని వారు అంటున్నారు. వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు , బి డి సి కొడితే దాదాపు 20 స్థానాల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలను దెబ్బ తీసుకున్నట్లు అవుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
… పొత్తు చెడితే ఖమ్మం జిల్లాలో కారు పార్టీ , సీట్లు పెరుగుతాయా..?
వామపక్షాలతో పొత్తు చెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం , కొత్తగూడెం , పినపాక , మధిర , పాలేరు, ఖమ్మం , నియోజకవర్గాల పరిధిలో కారు పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు..
. కమ్యూనిస్టులు ఉమ్మడి నిర్ణయం తీసుకుంటారా..!

సిపిఐ కి కొత్తగూడెం ,చెన్నూరు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. గాని ఆయా సీట్లపై కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆ పార్టీకి ఆయా సీట్లు కేటాయిస్తే , కాంగ్రెస్తో కలిసి ఉంటుందా , లేక సిపిఎం కు కూడా సీట్ల సర్దుబాటు జరిగితేనే కలిసి ఉంటుందా? లేదు ఆ రెండు పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ఒకే నిర్ణయంతో వేరుగా పోటీ చేస్తాయా , అనే విషయాలపై కూడా చర్చ జరుగుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ రెండు స్థానాలను స్పష్టంగా కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తే పొత్తు ఉంటుందని , లేకుంటే తమ పార్టీ వేరుగా పోటీ చేస్తుందని ప్రకటించారు. సీట్ల కేటాయింపు విషయంలో ఇటువంటి ప్రకటన సిపిఐ చేయలేదు. సిపిఐ నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది.
