అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతనిచ్చినట్లు ఆయా నేతలకు చెందిన అనుయాయులు తెలిపారు…
తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం నుంచి పోటీ చేయించేందుకు , కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు తుమ్మల కూడా తన అంగీకారాన్ని తెలిపినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం …
తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తారని, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఖమ్మం నుంచే పోటీ చేపిస్తుందని ఐకాన్ న్యూస్ సెప్టెంబర్ 16వ తేదీనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే…

తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తేనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో హోరాహోరీగా తలపడగలుగుతారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. మాజీ మంత్రిగా , రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా , తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గానికి ఢీటైన అభ్యర్థిగా ఉంటారని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఖమ్మం నియోజకవర్గం పరిధిలో ఉన్న తుమ్మల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, కాంగ్రెస్కు పడతాయని అంచనా వేశారు . దాదాపు 48 వేలు వరకు చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు న్నాయని, పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు

అయినప్పటికీ, తుమ్మలకే మెజారిటీ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఇంచుమించు అదే సంఖ్యలో ఉన్నాయి. వాటిలో మెజారిటీ ఓట్లు మంత్రి అజయ్ కుమార్ కు వెళతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు, కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొంతమందిలో అదే భావన వ్యక్తం అవుతోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లు కూడా కాంగ్రెస్కు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో , సహకరిస్తారని అంచనాలు కాంగ్రెస్ వ్యూహకర్తలు వేస్తున్నారు. సహజంగానే ఖమ్మం నియోజకవర్గం లో కాంగ్రెస్కు ఉండే సంప్రదాయ ఓటు బ్యాంకు తుమ్మలకు కలిసి వస్తుందని , అదే సందర్భంలో వామపక్ష పార్టీలతో ఎన్నికల పొత్తు కుదిరినందున వామపక్ష పార్టీలకు చెందిన ఓట్లు కూడా కాంగ్రెస్కు కలిసొస్తాయని భావిస్తున్నారు . కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావును పువ్వాడ అజయ్ కుమార్ పై ధీటైన అభ్యర్థిగా భావించి ఖమ్మం నుంచి పోటీకి దించుతున్నట్లు చెబుతున్నారు.
….. పాలేరు నుంచి పొంగులేటి బరిలోకి దిగనున్నారు…

ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించిన నాయకుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతనిచ్చినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఉండటంతో పాటు అత్యధికంగా ఎస్టీ వాడలు, బీసీ వర్గాలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గ అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది . క్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించడం ద్వారా కాంగ్రెస్ విజయ అవకాశాలను మెరుగుపరుచుకుంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం , ఆ పార్టీ వ్యూహకర్త సైతం ఇవే అంశాలతోటి తన సర్వే రిపోర్ట్ ఆధారంగా పొంగులేటికి పాలేరు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార కారు పార్టీ ఎమ్మెల్యే కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు అయినందున రెడ్డి పై రెడ్డిని కాంగ్రెస్ నిలబెట్టింది అనే చర్చ జరుగుతోంది. అది గాక కందాల ఉపేందర్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపైనే అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై గెలిచి ఆ తరువాత గులాబీ పార్టీలో చేరిపోయారు.
. … దాదాపు అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లే…
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం దాదాపు వామపక్ష పార్టీల సీట్లతో సహా అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసిందని ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి..
ఖమ్మం పాలేరు తో పాటు మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సత్తుపల్లి నుంచి మట్ట రాగమయి, అశ్వరావుపేట నుంచి జారే ఆదినారాయణ, వైరా నుంచి రామ్మూర్తి నాయక్, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి , భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పి వీరయ్య పోటీ చేస్తారని ఆయా వర్గాల నుంచి తెలుస్తోంది.
….. కొత్తగూడెం, భద్రాచలం నుంచి వామపక్షాలు పోటీ…
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీలకు పొత్తు కుదిరినందున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు పోటీ చేస్తారని, భద్రాచలం నుంచి సిపిఎం అభ్యర్థి రంగంలోకి దిగుతారని తెలుస్తోంది ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు కమ్యూనిస్టు పార్టీలకు రెండేసి అసెంబ్లీ స్థానాలను కేటాయించిన కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు, సిపిఎం కు మిర్యాలగూడ ఒక స్థానం, సిపిఐ కి మునుగోడు గాని లేదా చెన్నూరు గాని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇప్పటిదాకా కొనసాగిన ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లేనని కొందరు పేర్కొంటున్నారు అధికార బి ఆర్ ఎస్ ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకు ముందస్తు గా అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ మాత్రం కొంత ఆలస్యంగా అభ్యర్థుల ఎంపిక చేస్తోంది ఆ జాబితాను అధికారికంగా ఇంకా విడుదల చేయాల్సి ఉంది..
