ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

హస్తానికి మిత్ర లాభం చేకూరుతుందా…? కామ్రేడ్లతో కుదిరిన పొత్తు..కొత్తగూడెం సిపిఐ, భద్రాచలం సిపిఎం … ఇవి గాక మరో రెండు స్థానాలు కేటాయింపుకు నిర్ణయం..

Written by Mohiddin Shaik

కాంగ్రెస్ తో వామపక్షాల ఎన్నికల పొత్తు ఖరారైంది.. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ సిపిఎం పార్టీలకు 30 నుంచి 40 స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు ఉన్నాయి… స్వతహాగా ఆయా పార్టీలు గెలిచే స్థాయిలో ఓట్లు లేనప్పటికీ తమ మద్దతుతో తమ మిత్రపక్షాన్ని గెలిపించే ఓట్లు తమకు ఉన్నాయని ఆయా పార్టీ నేతలు పేర్కొన్నారు… ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయా పార్టీలకు ఇప్పటికీ బలమైన నాయకత్వంతో పాటు ఓటు బ్యాంకు ఉంది.. ఓటు బ్యాంకుతోపాటు ఆయా పార్టీల్లో ఎన్నికల నిర్వహణలో అనుభవం కలిగిన నాయకుల అనుభవాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో లాభం చేకూర్చుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.. సిపిఐ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తుండగా భద్రాచలం నుంచి సిపిఎం అభ్యర్థి రంగంలో ఉంటారని తెలుస్తోంది.మొదట సిపిఎం పాలేరు నియోజకవర్గం కోరుకున్నప్పటికీ ఆ తర్వాత భద్రాచలం నియోజకవర్గం కేటాయించాలని ఆ పార్టీ కోరినట్లు తెలుస్తోంది.. రెండు పార్టీలకు రెండేసి స్థానాలు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐ కొత్తగూడెం, , మునుగోడుగాని , చెన్నూరు గానీ, కేటాయిస్తారని తెలిసింది.ఆ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా సిపిఎం భద్రాచలం, మిర్యాలగూడెం స్థానాల నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. ఇవి గాక రెండు పార్టీలకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

….. కొత్తగూడెం నుంచి రంగంలోకి దిగనున్న కూనంనేని…

కొత్తగూడెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్, సిపిఎం మద్దతుతో సిపిఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కోణం నేని సాంబశివరావు మరోసారి పోటీ చేయనున్నారు. ఆయన గతంలో ఒక మారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు ప్రజల మనసుల్లో గుర్తుపెట్టుకునే విధంగా ఆయన అప్పట్లో పని చేశారని ప్రచారం ఉంది. మళ్లీ ఇప్పుడు ఆయన కొత్తగూడెం నుంచి తనను గెలిపించాలని కోరుతూ ప్రజల ముందుకు రానున్నారు. కాగా భద్రాచలం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థి రంగంలో నిల్వనున్నారు సిపిఎం పార్టీ కూడా గతంలో భద్రాచలం నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించింది. ఇక్కడ కూడా సిపిఐ సిపిఎం కలిసికట్టుగా పనిచేయడంతో పాటు కాంగ్రెస్ మద్దతు ఉన్నందున పోటీ హోరాహోరీగా ఉంటుందని పరిసరకులు అభిప్రాయపడుతున్నారు..

….వామపక్ష ఓట్లు కాంగ్రెస్కు కలిసి రానున్నాయా….

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లోనూ వామపక్ష పార్టీలతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. వామపక్షాల ఓట్లు భద్రాచలం , కొత్తగూడెం తో పాటు పినపాక ,మధిర ,వైరా ,ఖమ్మం ,పాలేరు, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో కూడా వాముపక్ష పార్టీల ఓటు బ్యాంకు ఉంది. సత్తుపల్లి అశ్వరావుపేట నియోజకవర్గాల్లో , కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలు కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు. మొత్తం మీద వామపక్షాలు కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు బి ఆర్ ఎస్ , ఇటు కాంగ్రెస్ వామపక్ష పార్టీల, కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కూటమికే విజయ అవకాశాలు ఉంటాయని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు అధికార పార్టీని కూడా ఆదరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment